సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ అవకాశాలు వస్తూనే ఉంటాయనుకుంటే పొరపాటే.ఒక సమయంలో ఒక వెలుగు వెలిగిన యాక్టర్ కొంత సమయానికి పూర్తిగా తెరమరుగు కావచ్చు.
అలా ఫేడవుట్ అయిపోయిన యాక్టర్లను ఏ దర్శకులు కూడా తిరిగి తీసుకురారు.కానీ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) మిగతా దర్శకులకు పూర్తి భిన్నం.
ఆయన ఫేడవుట్ అయిన యాక్టర్లకు మరో ఛాన్స్ ఇస్తుంటాడు.వారికోసం అద్భుతమైన పాత్రలను రాసి వారిని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడు.మరి ఆయన తీసుకొచ్చిన ఫేడవుట్ యాక్టర్లు ఎవరు, వారు పోషించిన రోల్స్ ఏంటో తెలుసుకుందాం.
• అర్జన్ బజ్వా
ఈ యాక్టర్ తెలుగు చిత్రాల్లో దీపక్‌గా పాపులర్ అయ్యాడు.సంపంగి (2001) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.తర్వాత అర్జన్ కొన్ని సినిమాల్లో నటించాడు కానీ పెద్దగా గుర్తింపు లభించలేదు.
మూడు-నాలుగు సంవత్సరాలలోనే అసలు ఈ యాక్టర్ సినిమాల్లో నటిస్తున్నాడా అని ప్రేక్షకులు అనుకునేంతలా తెరమరుగయ్యాడు.అలాంటి సమయంలో బోయపాటి శ్రీను అర్జన్ బజ్వాకు( Arjan Bajwa ) ఒక అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు.
భద్ర (2005)( Bhadra ) సినిమాలో హీరో ఫ్రెండ్, హీరోయిన్ అన్నయ్య పాత్ర ఆఫర్ చేశాడు.ఈ పాత్ర చాలా ముఖ్యమైనది.అందులో దీపక్ బాగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దీని తర్వాత అరుంధతి సినిమాలో హీరోయిన్ అనుష్క శెట్టికి కాబోయే భర్తగా నటించాడు.చివరగా తెలుగులో చిత్రాంగద సినిమాలో కనిపించాడు.
• వేణు తొట్టెంపూడి
చిరునవ్వుతో లాంటి మంచి ఫ్యామిలీ సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు వేణు తొట్టెంపూడి.( Venu Thottempudi ) తర్వాత ఈ హీరో సినిమాలకి దూరమయ్యాడు.ఒకటి రెండు సినిమాల్లో చేసిన పెద్దగా గుర్తింపు రాక ఫేడౌట్ అయిపోయాడు.అలాంటి సమయంలో బోయపాటి శ్రీను తన యాక్షన్ మూవీ “దమ్ము”లో( Dammu Movie ) మంచి ఆఫర్ ఇచ్చాడు.
అలా చాలా సంవత్సరాలు తర్వాత వేణు జూ.ఎన్టీఆర్‌కు బావ క్యారెక్టర్ లో మెరిశాడు.అయితే ఈ క్యారెక్టర్ బాగోలేదని, ఈ పాత్ర గురించి పూర్తిగా తెలిసి ఉంటే తాను అసలు ఈ సినిమాలో నటించి ఉండేవాడిని కాదని అతను తెలిపాడు.ఈ మూవీలో వేణు తొట్టెంపూడిని బాగానే ఎలివేట్ చేశారు.
• తులసి – శివాజీ
మాజీ నటుడు శివాజీ( Actor Shivaji ) తులసి సినిమా వచ్చేనాటికి హీరోగా ఫేడౌట్ అయిపోయాడు.అలాంటి సమయంలో బోయపాటి శ్రీను కలిసి సినిమాలో నయనతార బ్రదర్ గా నటించే అవకాశం ఇచ్చాడు.ఈ మూవీలో మళ్లీ శివాజీ బాగా ఎలివేట్ అయ్యాడు.
• వినయ విధేయ రామ
ఈ మూవీతో జీన్స్ సినిమా హీరో ప్రశాంత్( Hero Prashanth ) రీఎంట్రీ ఇచ్చాడు.ఇందులో చెర్రీ బ్రదర్ కొణిదెల భువన్ కుమార్ గా ప్రశాంత్ నటించి మెప్పించాడు.చరణ్ రెండవ సోదరుడుగా ఆర్యన్ రాజేష్ యాక్ట్ చేశాడు ఈ సినిమాతో వీరిద్దరూ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు.
• జగపతిబాబు – లెజెండ్
లెజెండ్ సినిమాకి( Legend Movie ) ముందు వరకు జగపతిబాబు( Jagapathi Babu ) కాళీగా సమయం గడిపారు.ఇక ఆయన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో లెజెండ్ సినిమాలో విలన్ రోల్ ఇచ్చి అతన్ని వేరే లెవెల్‌లో ఎలివేట్ చేశాడు బోయపాటి శ్రీను.తర్వాత జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ కి తిరుగులేకుండా పోయింది.