తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.ప్రస్తుతం ఈయన డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సినిమా షూటింగులలో కూడా పాల్గొంటున్నాడు.
ఇక ఈ రోజు నుంచి హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఆయన ఇప్పుడు మరొక సినిమాని కూడా రీమేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇప్పుడు చర్చలైతే జరుగుతున్నాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చాలా సినిమాలను రీమేక్ చేస్తూ వచ్చాడు.ఆ సినిమాలన్నీ కూడా ఆయనకు మంచి విజయాలను అందించాయి.అందుకే ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాల మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు.ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో రీమేక్ సినిమాలు చేయడమే బెస్ట్…ఎందుకంటే కొత్త కథను విని దాన్ని జడ్జ్ చేసి సినిమా చేసే అవకాశం లేదు.
ఇక రీమేక్ కథ అయితే డైరెక్ట్ గా సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి.కాబట్టి పవన్ కళ్యాణ్ మరొక సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) రైటర్ గా కొనసాగబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ రీమేక్ ని పూర్తి చేయాలని తద్వారా ఆయన సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ కూడా ఇవ్వాలని చూస్తున్నాట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి మరొక సంవత్సరం పట్టే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి సంవత్సరం తర్వాత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రజా సమస్యలను తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు… చూడాలి మరి పవన్ కల్యాణ్ చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి అనేది…
.