ఆచార్య ఫ్లాప్.. చిరంజీవితో విభేదాలపై ఓపెన్ అయిన కొరటాల!

డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్( NTR ) నటించిన తాజా చిత్రం దేవర( Devara ).ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Koratala Shiva Comments On His Relation With Chiranjeevi Details, Koratala Shiva-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే డైరెక్టర్ కొరటాల శివ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన చిరంజీవితో( Chiranjeevi ) తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి, భేదాభిప్రాయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Telugu Aacharya, Acharya Flop, Chiranjeevi, Devara, Koratala Shiva-Movie

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆచార్య( Acharya ) ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.తద్వారా భారీ నష్టాలు వచ్చాయి.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ డైరెక్టర్ ఎలా చెప్తే మేము అలా చేశాము అంటూ ఈ సినిమా బాధ్యత అంతా డైరెక్టర్ పై తోసేయడంతో అప్పట్లో భారీ స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

Telugu Aacharya, Acharya Flop, Chiranjeevi, Devara, Koratala Shiva-Movie

చిరంజీవి ఇలాంటి కామెంట్లు చేయడంతో చిరంజీవి కొరటాల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు కూడా హల్చల్ చేశాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల చిరంజీవితో విభేదాల గురించి స్పందించారు.చిరంజీవికి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు.

చిరంజీవి గారు పలు ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు.నిజానికి ఆచార్య ప్లాప్ అయిన తర్వాత నాకు మొదట మెసేజ్ చేసిన వ్యక్తి చిరంజీవి గారేనని కొరటాల తెలిపారు.

ఆచార్య ప్లాప్ అయిన తర్వాత నేను ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదు మూడు రోజులకే దేవర సినిమా పనులలో నిమగ్నమయ్యాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube