సినిమా సెలబ్రిటీలు డబ్బులు సంపాదించడంలోనే కాదు మంచి పనులు చేయడంలోనే ముందుంటారు.కష్టాల్లో ఉన్న ప్రజలకు తమ వంతుగా ఆర్థిక సహాయాలు చేస్తుంటారు.
మహేష్ బాబు, చిరంజీవి లాంటి హీరోలు లక్షలాదిమంది ప్రజల ప్రాణాలను నిలబెడుతూ రియల్ హీరోలుగా నిలుస్తున్నారు.ఇక మరికొంతమంది సినిమా సెలబ్రిటీలు పిల్లలను దత్తత తీసుకుని వారి జీవితాలను బాగు చేశారు.వారెవరో తెలుసుకుందాం.
• బండ్ల గణేష్
ప్రముఖ హాస్యనటుడు, నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) పైకి కొద్దిగా అగ్రెసివ్ గా కనిపిస్తాడు కానీ ఆయన మనసు మాత్రం చాలా మంచిది.ఈ సినీ సెలబ్రిటీ ఆహారం లేక వీధుల వెంట దయనీయంగా తిరుగుతున్న ఒక నేపాలీ అమ్మాయిని దత్తత తీసుకున్నాడు.బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.
తన భార్య ఆ నేపాలీ అమ్మాయిని మొదటగా చూసిందని చెప్పాడు.ఆ చిన్నారి తల్లి ఫుడ్ పెట్టే పరిస్థితుల్లో కూడా లేదట.
దీంతో చలించిపోయిన బండ్ల గణేష్ ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఈ అమ్మాయిని గొప్ప వ్యక్తిగా పెంచాలనుకుంటున్నానని కూడా అతడు చెప్పాడు.
ఈ విషయం తెలిసి చాలా మంది అతన్ని రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.
• రాఘవ లారెన్స్
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్( Raghava Lawrence ) 150 మంది పిల్లలను దత్తత తీసుకున్నాడు.వీరందరికీ ఫుడ్, షెల్టర్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాడు.వీరందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దటమే తన ఆశయమని ఆయన పేర్కొన్నాడు.
లారెన్స్ ఇంత మంది పిల్లల జీవితంలో వెలుగులు నింపాడని తెలిసి చాలామంది ఫిదా అయిపోయారు.ఈ నటుడు పిల్లల వైద్య ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తుంటాడు.
• సుష్మితా సేన్
సుష్మితా సేన్( Sushmita Sen ) 2000లో తనకు కేవలం 24 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు రెనీ సేన్ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది, ఆ సమయంలో తండ్రి ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు.తల్లి మాత్రం ఇంత చిన్న వయసులో ఎందుకు అడాప్షన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందట.కానీ తర్వాత ఒప్పుకుంది.సుష్మితా సేన్ 2010లో అలీసా అనే మరో అమ్మాయిని అడాప్ట్ చేసుకుంది.ఈ ఇద్దరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా ఆమె పెంచుతోంది.తన కడుపున పుట్టిన పిల్లలు కాకపోయినా వీరిని బాగా పెంచుతున్నానని ఆమె తెలిపింది.
ఈ ముద్దుగుమ్మ రక్షకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
• సన్నీ లియోన్
సన్నీ లియోన్,( Sunny Leone ) ఆమె భర్త డేనియల్ వెబర్ కలిసి 2017లో నిషా కౌర్ వెబర్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.దత్తత తీసుకునే సమయం నాటికి ఆ చిన్నారి వయసు కేవలం 21 నెలలే.మహారాష్ట్రలోని లాతూర్‌లోని ఓ గ్రామం నుంచి ఈ పాపను అడాప్ట్ చేసుకున్నారు.
అయితే అడాప్షన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉందని సన్నిలియోన్ విమర్శించారు.
రాజమౌళి
కేవలం నటీనటులు మాత్రమే కాదు రాజమౌళి( Rajamouli ) సైతం ఒక కుమార్తెను దత్తత తీసుకున్నాడు మొదటి కుమారుడు రమ మొదటి భర్త సంతానం కాగా కుమార్తె మయూకా మాత్రం వీరిద్దరికీ దత్తపుత్రికనే.