1.తెలంగాణ అసెంబ్లీలో 2020 -21 కాగ్ నివేదిక
2020- 21 సంవత్సరానికి గాను కాదు నివేదికను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
2.స్పీకర్ పోచారం తో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్, ఈటెల రాజేందర్, రాజా సింగ్ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు.
3.అసెంబ్లీ సెక్రటరీ ని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సెక్రటరీ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ రాజాసింగ్ రఘునందన్ రావు ఈరోజు ఉదయం కలిశారు .హైకోర్టు సూచనలను బీజేపీ ఎమ్మెల్యేలన స్పీకర్ దగ్గర కు , అసెంబ్లీ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్లారు.
4.రేపు జిహెచ్ఎంసి బడ్జెట్
2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిహెచ్ఎంసి బడ్జెట్ రేపు స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 65,155 మంది భక్తులు దర్శించు కున్నారు.
6.నేడు రేపు జేఎన్టీయూ లో మెగా జాబ్ మేళా
జెఎన్టియు హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్ మేళా లో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ తెలిపారు.
7.రైతు పై ఎలుగు బంటి దాడి
అనంతపురం జిల్లాలోని సెట్టూరు మండలం కొత్తపల్లిలో రమేష్ అనే రైతు పై ఎలుగు బంటి దాడి చేసింది.ఈ దాడిలో రమేష్ తల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
8.హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు తీర్పు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలు వరించింది.విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది.
9.వైసీపీ శాసన సభ పక్షం సమావేశం
నేడు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసన సభ పక్షం సమావేశం జరగ బోతోంది.
10.నేడు ఏపీ అసెంబ్లీ ముందు వ్యాట్ సవరణ బిల్లు
నేడు ఏపీ అసెంబ్లీ ముందు వ్యాట్ సవరణ బిల్లు ను ప్రవేశపెట్ట నున్నారు.
11.నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
నేటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మోగి పోతున్నాయి.ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.ఈ సందర్భంగా సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు.
12.నేడు హైదరాబాద్ కు ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం
నేడు హైదరాబాద్ కు ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం రానుంది అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీరు వీక్షించ నున్నారు.
13.మారనున్న ఇంటర్ పరీక్షల తేదీలు
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోంది.జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీషెడ్యూల్ కావడంతో, ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షల పై పడనుంది.
14.అభిమాని మృతి … ప్రభాస్ సాయం
గుంటూరు జిల్లాలోని కారం పూడి పలనాడు ఐమాక్స్ థియేటర్ వద్ద బ్యానర్ కడుతూ కోటేశ్వరావు ప్రభాస్ అభిమాని ప్రమాదవ శాత్తు మృతి చెందడంతో స్పందించిన హీరో ప్రభాస్ తక్షణ సహాయం కింద రెండు లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందించారు.
15.పవన్ కు మంత్రి అవంతి సవాల్
ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలపై గూండా గిరి చేశానని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
16.యూపీఎస్సీ పోస్టుల భర్తీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
17.ప్రధాని బెంగుళూరు పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ళ విరామం అనంతరం వచ్చేనెల 24వ తేదీన బెంగళూరులో పర్యటించ నున్నారు.
18.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.ఏపీ వ్యాప్తంగా వీవోఏ ల ఆందోళన
మూడు సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,600
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,930
.