కార్తిపై పవన్ కళ్యాణ్ ఫైర్ కావడానికి కారణాలివే.. కార్తి నిజంగానే తప్పు చేశారా?

ఫిల్మ్ ఇండస్ట్రీకి తాజాగా హీరో, ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై కుదిరితే మద్దతుగా మాట్లాడమని, కానీ అపహస్యం మాత్రం చేయొద్దని ఆయన తెలిపారు.

 Pawan Kalyan Fire On Tamil Hero Karthi, Pawan Kalyan, Karthi, Tamil Hero-TeluguStop.com

అలా చేస్తే ప్రజలు క్షమించరు అని ఆయన అన్నారు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో ( Vijayawada Kanakadurga Temple )శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.చిత్ర పరిశ్రమకు కూడా చెబుతున్నాను.

హిందూ ధర్మాన్ని రక్షించాలంటే మద్దతుగా నిలవండి.

Telugu Karthi, Pawan Kalyan, Pawankalyan, Tamil-Movie

కానీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు.తిరుపతి లడ్డూ ( Tirupati Laddu )అనేది బాధతో కూడిన అంశం.దీనిపై జోక్‌లు వేస్తున్నారు.

నిన్న రాత్రి ఒక సినిమా ఫంక్షన్‌లో చూశాను.సదరు హీరో లడ్డూ అనేది సెన్సిటివ్‌ ఇష్యూ నన్ను ఇందులోకి లాగొద్దు అన్నారు.

దయచేసి అలా మాట్లాడవద్దు.నటుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను.

సనాతన ధర్మం విషయంలో ఆ మాట అనాలంటే వందసార్లు ఆలోచించాలి అని పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు.ఈ సందర్బంగా పవన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే అసలేం జరిగిందంటే.

Telugu Karthi, Pawan Kalyan, Pawankalyan, Tamil-Movie

తమిళ హీరో కార్తి( Karthi ) నటించిన సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం హైదరాబాద్‌ లో జరిగింది.ఈ వేడుకలో కొన్ని మీమ్స్‌ను స్క్రీన్ మీద ప్రొజెక్ట్‌ చేసి కామెంట్‌ చెప్పమని యాంకర్‌ మంజూష కోరారు.ఒక మీమ్‌లో లడ్డూ కావాలా నాయనా అని వచ్చింది.

దాన్ని చూసిన కార్తీ ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు.సెన్సిటివ్‌ విషయమిది.

ఇప్పుడు మనకొద్దు అది అంటూ టాపిక్‌ డైవర్ట్‌ చేశారు.దీనిపై పవన్‌ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు.

దయచేసి అలా మాట్లాడొద్దని కార్తికి హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube