ఔను.. బహుమతులు తీసుకున్నా, నేరాన్ని అంగీకరించిన భారత సంతతి నేత ఈశ్వరన్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న భారత సంతతికి చెందిన సింగపూర్ రాజకీయవేత్త ఈశ్వరన్( Iswaran ) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.తాను రవాణా శాఖ మంత్రిగా( Transport Minister ) ఉన్నప్పుడు బహుమతులు అందుకున్నట్లుగా నేరాన్ని అంగీకరించినట్లు సింగపూర్ మీడియా నివేదించింది.2006లో మంత్రి వర్గంలో చేరిన ఈశ్వరన్.ఆ దేశ కోర్టులలో విచారణను ఎదుర్కొన్న తొలి మంత్రిగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.

 Singapore Indian-origin Ex-minister Pleads Guilty In Graft Case Details, Singapo-TeluguStop.com

62 ఏళ్ల ఈశ్వరన్ గతేడాది జూలైలో అరెస్ట్ అయ్యాడు.సింగపూర్ వ్యాపారవేత్త ఓంగ్ వ్యాపార ప్రయోజనాలకు అండగా నిలిచినట్లు ఆయన అభియోగాలు ఎదుర్కొన్నాడు.

ఇందుకు ప్రతిగా ఓంగ్ నుంచి వేల డాలర్ల విలువైన బహుమతులు అందుకున్నట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి.అయితే ఈ కేసులో ఓంగ్‌పై( Ong ) ఇప్పటి వరకు ఎలాంటి నేరం మోపలేదు.

తనపై వచ్చిన ఆరోపణలను ఈశ్వరన్ తొలుత ఖండించారు.

Telugu Englishpremier, Graft, Indian Origin, Iswaran, Pleads, Singapore, Soccer

తాజా విచారణలో న్యాయసేవకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ వ్యక్తి నుంచి బహుమతులు స్వీకరించినట్లుగా ఈశ్వరన్ నేరాన్ని అంగీకరించినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.ప్రాసిక్యూటర్లు ఈశ్వరన్ ఎదుర్కొంటున్న 35 అభియోగాను ఐదుకి తగ్గించినట్లు ఛానెల్ తెలిపింది.మిగిలిన 30 అభియోగాలను శిక్ష నిమిత్తం పరిగణనలోనికి తీసుకుంటామని వెల్లడించింది.

Telugu Englishpremier, Graft, Indian Origin, Iswaran, Pleads, Singapore, Soccer

బహుమతులను స్వీకరించినందుకు రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాను ఈశ్వరన్ ఎదుర్కొంటారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.అలాగే న్యాయ ప్రక్రియను అడ్డుకున్నందుకు గాను మరో 7 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా పడుతుందని అంటున్నారు.జనవరిలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం.ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో( English Premier League ) సాకర్ మ్యాచ్‌లు, మ్యూజికల్స్, ఓంగ్ ప్రైవేట్ విమానంలో టికెట్లు, సింగపూర్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ టికెట్లను ఈశ్వరన్ స్వీకరించినట్లుగా పేర్కొన్నారు.

కాగా.ఓ మంత్రి లంచం తీసుకున్నాడనే ఆరోపణలపై సింగపూర్‌లో 1986లో చివరిసారిగా విచారణ జరిగింది.నాడు జాతీయ అభివృద్ధి మంత్రిపై విచారణ చేపట్టగా.కోర్టులో అభియోగాలు మోపకముందే ఆయన కన్నుమూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube