టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Hero Megastar Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నారు.కాగా ఇటీవలే చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో( Guinness Book of World Records ) కూడా స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.
గిన్నీస్ రికార్డే ఆయన కోసం హైదరాబాద్ వరకూ వచ్చింది.మెగాస్టార్ ఏమాత్రం ఊహించ లేదు.

గిన్నీస్ రికార్డు మనకెందుకు వస్తుందేలే? అనుకున్నారు తప్ప, ఆయన్ని వెతుక్కుంటూ వస్తుందని గెస్ చేయలేదు.చిరంజీవి నటించిన సినిమాలకు గాను చేసిన డ్యాన్స్ మూమెంట్లకు గాను ఈ రికార్డును పదిలం చేసింది.ఆ సంగతి అటు ఉంచితే కింగ్ ఆఫ్ పాప్ మైఖెల్ జాక్సన్ ( King of Pop Michael Jackson )గురించి తెలిసిందే.ప్రపంచాన్నే తన పాప్ మాయా జాలంతో ఊపేసిన ఘనుడు మైకేల్ జాక్సన్.
ఇతని గురించి తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు.జాక్సన్ పేరును ఒక ట్యాగ్ గా తగిలించుకోవాలని ఎంతో మంది ఆశపడతారు.
ఆ రకంగా ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా ప్రభుదేవాకి ఆ గుర్తింపు ఉంది.అతడి డాన్సులను గుర్తించి చిత్రపరిశ్రమ అలా పిలుచుకుంటుంది.

అయితే చైనా( China ) ప్రేక్షకుల దృష్టిలో ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా కాదు మెగాస్టార్ చిరంజీవి అన్న సంగతి వెలుగులోకి వచ్చింది.చాలా చైనా వెబ్ సైట్లు చిరంజీవిని ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా అభివర్ణించాయి.ఈ విషయాన్ని గిన్సీస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి రిచర్స్డ్ రివీల్ చేసారు.చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్లను చైనా అభిమానులు ఎంతో క్లోజ్ గా స్టడీ చేసి ఆ స్థానం ఆయనకు కట్టబెట్టినట్లు చెప్పారు.
ఇది చిరంజీవి సాధించిన మరో అరుదైన ఘనత అనే చెప్పాలి.