టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )తాజాగా నటించిన చిత్రం దేవర.( Devara ) కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.విడుదల తేదీకి మరొక మూడు రోజులు మాత్రమే సమయము ఉంది.
దాంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.కాగా ఎన్టీఆర్ కి మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే.మరి ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ లెవెల్లో ఉంది.
అయితే ఈ చిత్రంతో ఆల్రెడీ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ రికార్డ్స్ బుకింగ్స్, బెనిఫిట్ షోస్ ఫుల్స్ తోనే చూపిస్తుండగా లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ రికార్డుని మ్యాన్ ఆఫ్ మాసెస్ తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలుగా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని నార్త్ అమెరికా మార్కెట్ లో కొట్టిన రెండో హీరోగా తారక్ ఆర్ఆర్ఆర్,దేవర సినిమాలతో నిలిచాడు.
మరి దీనికి ముందు ప్రభాస్ నటించిన భారీ చిత్రాలు సలార్, కల్కి 2898 ఎడి( Salar, Kalki 2898 Ed ) చిత్రాలు ఉన్నాయి.ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.ఇలా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉండడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుకుంటున్నారు.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.