దివ్యాంగుల బస్ పాస్ స్పెషల్ క్యాంప్ మేళా

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో దివ్యాంగులకు బస్ పాస్ ల జారీ మేళా నిర్వహించనున్నట్లు సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం సిరిసిల్ల కొత్త బస్టాండ్ లోని బస్ పాస్ కౌంటర్ లో సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

 Handicapped Bus Pass Special Camp, Handicapped Bus Pass,bus Pass Special Camp Me-TeluguStop.com

సదరం సర్టిఫికెట్ లో లోకో మోటర్/ఆర్ధో 40 శాతం మించి ఉండాలని, వినికిడి, దృష్టిలోపం ఉన్నవారికి 100% ఉండాలని, మెంటల్ రిటార్టేషన్ ఉన్న వారి ఐక్యూ 69 శాతం కంటే తక్కువ ఉండాలని తెలిపినారు.

కావున దివ్యాంగులు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు ఐడి కార్డ్ సర్వీస్ ఛార్జ్ కొరకు RS:50/- యాభై రూపాయలు తీసుకొని సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో నిర్వహించు దివ్యాంగుల బస్ పాస్ స్పెషల్ క్యాంప్ మేళా నందు PHC బస్ పాస్ లను పొందాలని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube