రాజన్న సిరిసిల్ల జిల్లా : తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హిందూ బంధువులు మంగళవారం శ్రీ మార్కండేయ ఆలయం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు చేరుకొని అనంతరం స్థానిక సాయిబాబా ఆలయంలోని ఉన్న అయ్యప్ప ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లడ్డులో కల్తి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండద్దని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







