ఎన్టీఆర్( NTR ) దేవర( Devara ) సినిమా 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని మేకర్స్ ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ సినిమా వేడుకను కర్నూలులో నిర్వహించాలని భావించారు.
కానీ చివరికి హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ లో( Novotel Hotel ) ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.అయితే ఈ కార్యక్రమం ప్రారంభానికి కొన్ని గంటల ముందు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవడంతో సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తాయి.
భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో చేసేదేమీ లేక ఈ వేడుకను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు.దీంతో అక్కడికి వెళ్లిన అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ అభిమాన హీరో ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ వేడుకను చూడటం కోసం చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము ఇలాంటి సమయంలో ఈవెంట్ క్యాన్సిల్ చేస్తే ఎలా అంటూ మండిపడుతూ హోటల్( Hotel ) మొత్తం ద్వంశం చేశారు.
ఇలా అక్కడ కుర్చీలను విరగొట్టడం అద్దాలను పగలగొట్టడం వంటి వాటి ద్వారా భారీ స్థాయిలో నష్టాలను తీసుకువచ్చారు.ఈ విధంగా ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఈ పనికి సంబంధించి ఎన్నో వీడియోలు కూడా బయటకు వచ్చాయి.అయితే ఇలా ధ్వంసం చేయడంతో హోటల్ యాజమాన్యానికి భారీ స్థాయిలో నష్టం వచ్చిందని తెలుస్తోంది.కేవలం కుర్చీలు విరగొట్టిన దానికే 7 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందని, అలాగే ఈ హోటల్లో సృష్టించిన విధ్వంసం కారణంగా సుమారు 33 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు హోటల్ యాజమాన్యం వెల్లడించారు.
మరి ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.