సాధారణంగా ఒక్కోసారి మనం చాలా వీక్ గా మారిపోతూ ఉంటాము.ఏ పని చేయలేక ఇబ్బంది పడుతుంటాము.
అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా శరీరం సహకరించదు.అలాంటి సమయంలో మందుల కన్నా మంచి ఆహారమే మనల్ని త్వరగా రికవరీ అయ్యేలా చేస్తుంది.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ షేక్ వీక్ గా ఉన్నప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఉదయం ఈ ప్రోటీన్ షేక్ ను తీసుకుంటే కొద్ది రోజుల్లోనే చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా మారతారు.

ప్రోటీన్ షేక్( Protein shake ) తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు వేరుశనగలు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.బాగా నానిన తర్వాత వేరుశనగల పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక అరటిపండు( Banana )ను స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.అలాగే నానబెట్టి పొట్టు తొలగించిన వేరుశనగలు( Peanuts ), రెండు టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన తేనె మరియు ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరిపాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్ షేక్ రెడీ అవుతుంది.

బలహీనంగా ఉన్నప్పుడు, నీరసం కుమ్మేస్తున్నప్పుడు ఈ ప్రోటీన్ షేక్ ను కనుక తీసుకుంటే శరీరానికి బోలెడంత ఎనర్జీ లభిస్తుంది.వీక్ గా ఉన్నవారు చాలా త్వరగా రికవరీ అవుతారు.అలాగే ఈ ప్రోటీన్ షేక్ కండరాల నిర్మాణానికి అద్భుతంగా తోడ్పడుతుంది.ఎముకలను బలోపేతం చేస్తుంది. హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.మానసిక స్థితిని నియంత్రించడంలో, జ్ఞాపకశక్తిని సంరక్షించడంలో మరియు ఆలోచన సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే అమైనో ఆమ్లాలు ఈ ప్రోటీన్ షేక్ లో పుష్కలంగా ఉంటాయి.
అంతేకాకుండా ఫైబర్ రిచ్ గా ఉండే ఈ షేక్ ను తీసుకుంటే మలబద్ధకం సమస్య సైతం దూరమవుతుంది.