మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సినిమా కథలను సన్నివేశాలను డాన్స్ మూమెంట్లను మ్యూజిక్ ను కాఫీ కొట్టడం అన్నది సాధారణ విషయం.ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్( Director Shankar ) ఇలాంటి హెచ్చరికలనే చేశారు.భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్ 2 చిత్రం( Indian 2 movie ) నిరాశపరిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఊహించని విధంగా ఫలితాలను రాబట్టడంతో ఆయనపై చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు.ఇకపోతే ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్.
రామ్‌చరణ్ ( Ram Charan )హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ ( Author S.Venkatesan )రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు.దీనిపై స్పందించిన ఆయన తన ట్విట్టర్ మీడియాలో పేర్కొంటూ ఎస్.
వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు తెలిపారు.అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందని అన్నారు శంకర్.

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఒక చిత్రం ట్రైలర్‌లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానని అన్నారు.దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్‌లోగానీ ఉపయోగించరాదని అన్నారు.దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు.అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదని, అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు.అయితే వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ సినిమాలో వాడారు అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు.

కానీ శంకర్ దేవర( Deavara ) సినిమాను ఉద్దేశించి ఆ విధంగా కామెంట్ చేశాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది.దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు.కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.