నటుడు గిరిబాబు( Giri Babu ) తను నటిస్తూనే సినిమాలను నిర్మిస్తూ కూడా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు కొనసాగారు.పక్క హీరోలతో సినిమాల తీయడం మాత్రమే కాదు.
తన కొడుకును కూడా హీరో చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు.గిరిబాబుకు ఇద్దరు కుమారులు.
అందులో పెద్దవాడైన రఘుబాబు( Raghu Babu ) మనందరికీ తెలిసిన నటుడే.అయితే రఘుబాబు హీరో మెటీరియల్ కాదు అని ఉద్దేశంతో క్యారెట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలతో సినిమాల్లో బిజీ నటుడి గానే ఉన్నాడు.
ఇక చిన్న కుమారుడైన బోసు బాబు మొదట హీరో గానే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు.

బోసు బాబుని( Bose Babu ) ఎలాగైనా హీరో చేయాలని గిరిబాబు అనుకున్నాడు అందుకే 45 లక్షల ఖర్చుపెట్టి ఇంద్రజిత్( Indrajith Movie ) అనే ఒక కౌబాయ్ కాన్సెప్ట్ తో సినిమా తీసి అందులో బోసుబాబుని హీరోగా పెట్టాడు.సరిగ్గా అదే సమయంలో చిరంజీవి కొదమ సింహం( Kodama Simham ) సైతం కౌబాయ్ కాన్సెప్ట్ తోనే వస్తుంది.ఇంద్రజిత్ సినిమా మొదట మొదలై షూటింగ్ కూడా ముందే పూర్తిచేసుకుని సెన్సార్ పనులను కూడా ఫినిష్ చేసుకుంది.
అయితే సెన్సార్ ఆయన ఈ సినిమాని కొంతమంది కావాలని రఘు బాబుతో సినిమా తప్పించుకుని చూసి సరిగ్గా అదే సమయానికి విడుదలను కూడా పెట్టుకున్నారు.ఇంద్రజిత్ విడుదల తేదీ రోజు నే కొదమ సింహం రిలీజ్ కూడా ప్రకటించేశారు.
అంతకన్నా ముందే ఇంద్రజిత్ సినిమాను కొనడానికి వచ్చిన వాళ్లంతా కూడా చిరంజీవి( Chiranjeevi ) సినిమా కావడంతో అటువైపు వెళ్ళిపోయారు.

దాంతో చిరంజీవి సినిమా కోసం బోసుబాబు సినిమాలో వాయిదా వేశారు గిరిబాబు.కొదమ సింహం విడుదలై కాస్త పర్వాలేదనిపించుకుంది.అయితే అంత పెద్ద స్టార్ సినిమానే కౌబాయ్ కాన్సెప్ట్ తో వచ్చి ఈ వర్కౌట్ కావడం కాలేదు కాబట్టి ఒక కొత్త నటుడు ఆయన బోసు బాబు సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది అని భయ్యర్స్ కొనడానికి ముందుకు రాలేదు.
ఇక సగం ధర కే చిత్రాన్ని అమ్ముకున్న గిరిబాబు నష్టపోయారు.అయితే కొదమ సింహం కన్నా ఎక్కువ రోజులు ఈ సినిమా నడిచినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ మార్కెట్లో ప్రచారం చేసారట కొంతమంది.
దాంతో దాని ద్వారానే బోసుబాబు హీరో అవ్వకుండా ఈ సినిమాతోనే ఆగిపోయాడు.