తెలంగాణ ఆవిర్భావ వేడుకలు .. సోనియా గాంధీ చుట్టూ వివాదం 

జూన్ 2 తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ( Telangana Independence Day ) వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీని( Sonia Gandhi ) ఆహ్వానించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పై వివాదం చోటుచేసుకుంది.

 Controversy Surrounds Sonia Gandhi's Telangana Birth Celebrations , Telangana, C-TeluguStop.com

అసలు సోనియా గాంధీని ఏ విధంగా ఆహ్వానిస్తారని బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు.తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు .దీంతో రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చగా మారింది.అసలు సోనియాగాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతారో లేదో తెలియదు కానీ , అంతకంటే ముందుగానే ఆమెను ఆహ్వానించడం పై బిజెపి,  కాంగ్రెస్ ( BJP, Congress )ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

Telugu Congress, Kishna Reddy, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandi, Telanga

సోనియాను ఆహ్వానించడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని మూడు రోజుల క్రితం జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు .దీనిపైనే బిజెపి విమర్శలు చేస్తోంది.సోనియాను ఈ వేడుకలకు పిలవడం ఏమిటని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

అసలు సోనియా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారో చెప్పాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మందిని బలి తీసుకున్నందుకు సోనియాను ఆహ్వానించి సన్మానిస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Telugu Congress, Kishna Reddy, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandi, Telanga

ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధినేతను ఎలా ఆహ్వానిస్తారని , పార్టీ కార్యక్రమం అయితే గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు.అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అంటూ ప్రశంసిస్తూ బిజెపి నేతలపై మండిపడుతున్నారు.

సోనియా రాకను తప్పుపడుతున్నారంటే బిజెపి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube