వీడియో వైరల్: తెలివి చల్లగుండా.. పాత టీవీని ఇలా ఎలా మార్చావు బ్రో..

ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో రకాల వింతలకు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంటాయి.ఇకపోతే ప్రపంచంలో జుగాద్( Jugaad ) చేసే ప్రజలు చాలానే ఉన్నారు.

 Desi Jugaad A Man Made The Tv Body Cooler Video Viral On Social Media Details, A-TeluguStop.com

ఈ విషయంలో భారతదేశం కాస్త మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు.మనవాళ్లు ఎలాంటి సమస్యలైనా సరే దానికి అతి తక్కువ ఖర్చులో పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇదివరకే వైరల్ అవడం గమనించాము.ఇందులో భాగంగానే కొందరు రకరకాల కూలర్లు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పంచుకున్న వారిని చూసాం.

ఇకపోతే ఈసారి కాస్త వెరైటీగా ఓ వ్యక్తి ఆలోచించి తన పాడైపోయిన టీవీతో కూలర్ ను( Cooler ) తయారు చేశాడు.ప్రస్తుతం ఈ వింత కూలర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో గురించి ఓసారి చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలను గమనించినట్లయితే.ఓ వ్యక్తి తన పాత టీవీని( Old TV ) ఉపయోగించి ఓ అద్భుతాన్ని సృష్టించాడు.పాడపోయిన టీవీతో కూలర్ ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్నాడు.

వీడియోలో గమనించినట్లయితే.టీవీ స్క్రీన్ ఉన్న స్థానంలో ఫ్యాన్ ఇన్స్టాల్ చేశాడు.

అంతేకాదండోయ్.టీవీ చుట్టుపక్కల కూలింగ్ ప్యాడ్స్ ను కూడా ఏర్పాటు చేసి లోపల మోటార్ ను పెట్టాడు.

దీంతో అతి తక్కువ ఖర్చుతోనే కూలర్ ను ఏర్పాటు చేసుకున్నాడు.దీనికి ఆన్, ఆఫ్ చేయడానికి స్విచ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఈ వైరల్ వీడియోని( Viral Video ) వీక్షించిన చాలామంది నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అండి మీకు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు ఈ వస్తువుకు ఏ పేరు పెట్టాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.కొందరేమో ఈ పరికరానికి ‘టెలికూలర్’ అంటూ నామకరణం కూడా చేసేశారు.టెలివిజన్ + కూలర్ ఉండడంతో ఈ పేరును ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube