తెలుగు ప్రేక్షకులకు చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.త్రిష( Trisha ) ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది త్రిష.ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
40 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది.ఇకపోతే గతంలో త్రిష పెళ్లిపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.ఒక సారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది.
ఇదంతా పక్కనబెడితే హీరోయిన్ త్రిష ఒక హీరో పెళ్లికి అడ్డుపడిందట.ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే.ఒకరికి ఒకరు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్( Sriram ).త్రిషతో మనసెల్లామ్ అనే మూవీ చేశాడు.అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందట.
2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు.దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పిందట.ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పిందట.
ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.నువ్వు నా ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చిందట.
తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది హీరోయిన్ త్రిష.