టూరిస్టులకు హాయ్ చెబుతున్న పులి.. చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు...

అడవి జంతువుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఈ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి.

 Tigress Waves At Tourists Leaving Netizens In Awe Video Viral Details, Nikhil Gi-TeluguStop.com

వేటాడే జంతువులు, ఆడుకుంటున్న జంతువులు చూసినా మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఒక మంచి వైల్డ్ లైఫ్ ఫోటో లేదా వీడియో చూసినప్పుడు మనకు చాలా ఎమోషనల్స్ కలుగుతాయి.

ఇటీవల మహారాష్ట్రలోని తాడోబా నేషనల్ పార్క్-అందాహరి టైగర్ రిజర్వ్‌లో( Tadoba National Park-Andhari Tiger Reserve ) ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది.ఇక్కడ ఒక పులి ( Tiger ) పర్యాటకులకు “సలామ్” చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఫొటోగ్రాఫర్ నిఖిల్ గిరి( Photographer Nikhil Giri ) ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు.

వీడియోలో పులి కెమెరా వైపు తిరిగి, తన పాదాన్ని ఎత్తి, సలామ్ చేసినట్లుగా లేదా హాయ్ చెప్పినట్లుగా కనిపిస్తుంది.

ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది, అందుకే చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపోయారు.

అడవి జంతువులు( Wild Animals ) కూడా మనలాంటివేనని, వాటికి భావోద్వేగాలు కూడా ఉన్నాయని ఈ దృశ్యం గుర్తు చేస్తుంది.నిఖిల్ గిరి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక క్షణాన్ని హైలైట్ చేస్తూ క్యాప్షన్‌తో వీడియోను పంచుకున్నారు.

వీడియోకు 16 లక్షల వ్యూస్, 165,000 లైక్స్‌ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా యూజర్లు ఫోటోగ్రాఫర్ సహనం, నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ వ్యాఖ్యల విభాగాన్ని నింపారు.చాలా మంది ఈ వీడియో తమను మంత్రముగ్ధుల్ని చేసిందని అన్నారు.దీనిని మిలియన్ డాలర్ల క్షణం అని పిలిచారు.

ఒక యూజర్ పులి గొప్పతనంపై వ్యాఖ్యానించగా, మరొకరు వన్యప్రాణి ఫోటోగ్రఫీ పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు, ఇది ప్రజలకు అరుదైన, అందమైన క్షణాలను ఎలా తీసుకువస్తుందో ప్రశంసించారు.

కొంతమంది వ్యూయర్స్‌ ఆడపులి తన పాదాలతో హాయ్ అని చెప్పడం కంటే వాటిని శుభ్రం చేస్తోందని ఊహించారు, అయినా వీడియో చూస్తుంటే చాలా బాగా అనిపించిందని పేర్కొన్నారు.ఫోటోగ్రాఫర్ సహనానికి, అంకితభావానికి ఈ క్షణం సరైన బహుమతి అని చాలా మంది అంగీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube