షాపింగ్ మాల్‌లో వ్యక్తిని చూసి జీసస్ అనుకున్న బాలుడు.. ఆ తర్వాత..??

చిన్న పిల్లలలో అమాయకత్వం ఎక్కువ.వాళ్లకు నిజ ప్రపంచం గురించి అంతగా తెలియదు.

 Little Boy Confuses Man For Jesus In This Hilarious Video Details, Children, Inn-TeluguStop.com

ఈ కారణంగా వాళ్లు ఫిక్షనల్ క్యారెక్టర్స్‌, సూపర్ హీరోలు, ఇతర ఊహాజనిత పాత్రలు నిజమే అని నమ్ముతారు.అలాంటి ఒక పిల్లోడు( Little Boy ) తాజాగా ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారాడు.

అతడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియోలో చిన్న పిల్లవాడు షాపింగ్ మాల్‌లో( Shopping Mall ) ఒక వ్యక్తిని చూసి “జీసస్” ( Jesus ) అని అన్నాడు.

ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ వ్యక్తి జీసస్ కాదని వివరిస్తారు.

ఆ వ్యక్తి ఆ పిల్లవాడి మాటలకు నవ్వుతూ వెళ్లిపోతాడు.

ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసారో తెలియదు.ఆ పిల్లవాడు ఆ వ్యక్తిని యేసు క్రీస్తు అనుకున్నాడు.

ఎందుకంటే ఆ వ్యక్తికి పొడవాటి జుట్టు, తెల్లటి చర్మం ఉన్నాయి.చిత్రాలలో యేసును చూపించేటప్పుడు ఈ రెండు లక్షణాలను చూపిస్తారు.

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెట్టారు, వారి పిల్లలు కూడా నిజమైన వ్యక్తులను దేవుళ్లు లేదా సూపర్ హీరోలుగా నమ్ముతారని చెప్పుకొచ్చారు ఒక వ్యక్తి తన కొడుకు తెల్లటి గడ్డంతో ఉన్న ప్రతి వృద్ధుడిని చూసి “శాంతా క్లాజ్‌” అనుకునేవాడని చెప్పారు.

మరొకరు తన ఫ్రెండ్ యేసులా ఉంటారని, ఆయన సిగరెట్ తాగుతుంటే చూసి పిల్లలు ఎంతో ఆశ్చర్యంగా ఫీలయ్యారని తెలిపాడు.వారు నవ్వుతూ, యేసు సిగరెట్లు తాగకూడదని, అది తప్పు అనిపించిందని చెప్పారు.పిల్లల అమాయకత్వం ఊహలకు అందదు అని వ్యాఖ్యానించారు.

అయితే, పిల్లలు నిజమైన వ్యక్తులను కల్పిత జీవులు అనుకోవడం ఎప్పుడూ ఫన్నీగా ఉండదు.కొన్ని సార్లు తల్లిదండ్రులకు ( Parents ) ఇబ్బంది కూడా కలిగిస్తుంది.ఉదాహరణకి పొట్టిగా ఉన్న వారిని సినిమా క్యారెక్టర్లతో పోలిస్తే అవతల వ్యక్తి అవమానంగా ఫీల్ అవుతారు.కోపంతో అరవచ్చు కూడా తల్లిదండ్రులు ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందిగా ఫీల్ అవ్వక తప్పదు.

మరొక తల్లిదండ్రులు తమ కొడుకు ఒక హిస్పానిక్ వ్యక్తి కిరాణా సామాను దించుతుండటం చూసి, అతను కమెడియన్ జార్జ్ లోపెజ్ అని అనుకున్నాడని చెప్పారు.ప్రతి హిస్పానిక్ వ్యక్తి మిస్టర్ లోపెజ్ కాదని వారు తమ కొడుకుకు వివరించాల్సి వచ్చింది.

ఈ సంఘటనలు పిల్లల అమాయకత్వం, ఊహాశక్తిని గుర్తు చేస్తాయి.దీని వల్ల తల్లిదండ్రులకు కొన్నిసార్లు నవ్వు రావచ్చు, మరికొన్నిసార్లు ఇబ్బంది కూడా కలగవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube