వరల్డ్ రికార్డ్: ఎవరు ఊహించని రికార్డ్ ను నమోదుచేసిన న్యూజిలాండ్ క్రికెటర్..

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024లో( T20 World Cup 2024 ) లీగ్ దశ మ్యాచ్ లతో చివరి దశకు చేరుకుంది.19వ తారీఖు నుండి సూపర్ 8 మ్యాచులు మొదలుకానున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన న్యూజిలాండ్ – పాపువా న్యూ గినియా దేశంతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్( New Zealand ) పాపువా న్యూ గినియా పై( Papua New Guinea ) భారీ విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ మ్యాచ్లో ఎవరికి సాధ్యం కానీ ఓ చరిత్ర రాయబడింది.

 Lockie Ferguson Bowls The Most Economical Spell In T20 History With 4 Maidens De-TeluguStop.com

ఇక ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూస్తే.

నేటి మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్( Lockie Ferguson ) సరికొత్త రికార్డును సృష్టించాడు.ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానీ రికార్డును ఏకైక బౌలర్ గా అతడు నిలిచాడు.టి20 క్రికెట్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఈ రికార్డును ఇప్పటివరకు సాధించలేదు.ఇంతకీ అతడు ఏ రికార్డు సృష్టించాడో ఓసారి చూద్దామా.సోమవారం నాడు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు లాకీ ఫెర్గూసన్ తన కోట నాలుగు ఓవర్లను పూర్తి చేశాడు.

Telugu Overs Maidens, Cup, Lockie Ferguson, Zealand Bowler, Papua Guinea-Latest

అయితే ఈ నాలుగు ఓవర్లు కూడా మెయిడిన్( Maiden Overs ) కావడం విశేషం.కేవలం ఒక్క పరుగంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు.ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక్క మ్యాచ్లో అందులో టి20 చరిత్రలో నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రైట్ ఆన్ ఫాస్ట్ బౌలర్ 42 టి20 మ్యాచ్ లు ఆడగా 61 వికెట్లు 7.15 ఎకనామితో పడగొట్టాడు.అయితే ఇక్కడ విశేషమేమిటంటే.

ఈ 42 మ్యాచ్లో కేవలం 5 ఓవర్లు మాత్రమే మెయిడిన్ అయ్యాయి.

Telugu Overs Maidens, Cup, Lockie Ferguson, Zealand Bowler, Papua Guinea-Latest

ఇదివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ మరో ఆటగాడు అయినా టీం సౌదీ పేరున ఉన్నది.ఆయన నాలుగు ఓవర్లు వేసి నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇక ఈ లిస్టులో మూడో పేరు.

ఉగాండా ఆటగాడు ఫ్రాంక్ ను సుబ్బుగా పిఎన్జి పై నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.అయితే నవంబర్ 2021 లో పనామా పై కెనడా బౌలర్ సాడ్ బిన్ జాఫర్ నాలుగు ఓవర్లలో నాలుగో ఓవర్లు మెయిడిన్ చేసి మూడు వికెట్లను కూడా పడగొట్టాడు.

అయితే ఇది ఐసీసీ కిందికి రాకపోవడంతో ఆ రికార్డు తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube