ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు విడుదల అయిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఒక రేంజ్ లో మారుమోగుతోంది.
ఆ సంగతి అటు ఉంచితే.సినిమా అనేది ఎంత శక్తీ వంతమైనదో పవన్ కళ్యాణ్ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది.
ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడానికి, మంత్రి అవ్వడానికి సినిమానే కారణం.పవన్ కి కూడా ఈ విషయం తెలుసు.

అంత కంటే ముఖ్యంగా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసింది సినిమానే అనడంలో ఎటువంటి సందేహం లేదు.పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ళ క్రితమే షూటింగ్ స్టార్ అయ్యింది.కానీ అనుకొని కారణాల వాళ్ళ పోస్ట్ ఫోన్ అవుతు వచ్చింది.వీరమల్లు తర్వాత ప్రారంభమయిన. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు వీరమల్లు సినిమాతో పోల్చుకుంటే కొంచం స్పీడ్ గానే షూటింగ్ ని జరుపుకున్నాయి.పైగా వీరమల్లు గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందనే పుకార్లు వ్యాపించాయి.

దీంతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం( A M Rathnam ) రంగంలోకి దిగి మూవీ ఆల్రెడీ యాభై శాతం అయిపోయిందని చెప్పాడు.పైగా చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ చేసాడు.టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇప్పుడు ఇంకో న్యూస్ వాళ్ల ఆనందానికి రెస్ట్ లేకుండా చేస్తుంది.అదేమిటంటే జూన్ చివరి వారం నుంచి లేదా జులై మొదటి వారం నుంచి పవన్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.ఈ మేరకు చిత్ర యూనిట్ కి సమాచారం ఇచ్చాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
పవన్ ఎన్నికల్లో గెలిచి కొన్ని రోజులు కూడా కాలేదు.పైగా మినిస్టర్ అండ్ డిప్యూటీ మినిస్టర్ గా ఇంకా కుదురుకోలేదు.
అలాంటిది సినిమాకి పవన్ ప్రాధాన్యత ఇస్తున్నాడు.తన వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకూడదనే పవన్ తాపత్రయానికి ఫ్యాన్స్ హాట్స్ ఆఫ్ చెప్తున్నారు.
అదే విధంగా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh )లకి కూడా కొంచం లేటుగా అయినా కూడా డేట్స్ కేటాయిస్తాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.ఏది ఏమైనా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవిలో ఉండగానే మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడం చూస్తుంటే అందరకి పెద్దాయన సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉండగానే శ్రీనాధ కవి సార్వభౌముడు షూటింగ్ లో ఆయన పాల్గొనడం జరిగింది.అలా అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్.