టెస్లా సైబర్ ట్రక్ కొనుగోలు చేసిన దుబాయ్ పోలీస్.. మస్క్ రియాక్షన్ ఇదే..??

సినిమాల్లో చూసే వాహనంలా అనిపించే టెస్లా సైబర్‌ట్రక్( Tesla Cybertruck ) కనిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈ అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

 Elon Musk Unmissable Reaction To Dubai Police Addition Of Tesla Cybertruck To Pa-TeluguStop.com

ఈ అద్భుత వాహనం వీడియోలు కూడా ప్రజలను కట్టిపడేస్తున్నాయి.దుబాయ్ పోలీసులు( Dubai Police ) కూడా దీనిని చూసి మనసు పడ్డారు.

అందుకే దానిని కొనుగోలు చేశారు.

వాళ్లు తమ లగ్జరీ పెట్రోలింగ్ వాహనాలల్లో సైబర్‌ట్రక్‌ను చేర్చారు.

టూరిస్ట్ పోలీసుల కోసం ర్యాండమ్ పెట్రోలింగ్ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించనున్నారు.దీనికి సంబంధించి దుబాయ్ పోలీసులు ఇటీవల ఒక ఫోటోను షేర్ చేశారు.

ఈ ప్రకటన చాలా మందిని ఆకట్టుకుంది, ఒక్క రోజులోనే 360,000 కి పైగా వ్యూస్ సంపాదించింది.టెస్లా సీఈవో ఎలాన్ మస్క్( Elon Musk ) కూడా ఈ పోస్ట్‌కు స్పందించి, తన ఆమోదాన్ని తెలిపారు.

కూల్ అంటూ ఒక ఎమోజీ షేర్ చేశారు.

CNBC ప్రకారం, సైబర్‌ట్రక్ ధర 39,900 డాలర్ల నుంచి ప్రారంభమవుతుందని అంచనా, ఇది సుమారు 33 లక్షల రూపాయలకు సమానం.దీనిని 2019లో లాస్ ఏంజిల్స్‌లో మొదట ప్రదర్శించారు కానీ మొదటి డెలివరీలు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, 2023 నవంబర్‌లో జరిగాయి.

దుబాయ్ పోలీసులు సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేశాక కార్ లవర్స్ ప్రశంసలు కురిపించారు.కొంతమంది వాహన శబ్దాలను సైరన్‌లా మార్చేలా స్పీకర్‌ను మెరుగుపరచడం, మరింత మెరుగైన లైట్లను జోడించడం వంటి మార్పులు చేస్తే బాగుంటుందని సూచించారు.చాలా మంది ఇతరులు తమ వ్యక్తిగత వాహనంగా సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేయాలని ఉందని, దుబాయ్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పాలని అడిగారు.

టెస్లా( Tesla ) వెబ్‌సైట్ ప్రకారం సైబర్‌ట్రక్‌ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.దీనిని చాలా గట్టిగా ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ బాహ్య పొర (ఎక్స్‌ఓస్కెలిటన్), బలమైన గాజుతో తయారు చేశారు.ఈ ట్రక్ గరిష్టంగా 11,000 పౌండ్లు (సుమారు 5,000 కిలోలు) బరువును మోయగలదు.2,500 పౌండ్లు (సుమారు 1,100 కిలోలు) సామగ్రిని తీసుకెళ్లగలదు.ఇది కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 340 మైళ్లు ప్రయాణించగలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube