వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న మహిళను గేదె కొమ్ములతో ఒక్కసారిగా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోలు వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉన్నాం.ఇందులో ఎక్కువగా వన్య మృగాలకి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి.

 A Woman Who Was Walking On A Road Being Dragged By A Cattle In Thiruvotriyur Che-TeluguStop.com

ఇకపోతే అప్పుడప్పుడు ఈవన్య మృగాలు ప్రజల ఆవాసాలలోకి వచ్చి ఇబ్బందులను గురి చేసిన సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక తాజాగా చెన్నై( Chennai ) నగరంలోని ఓ ప్రాంతంలో ఓ గేదె( Cattle ) మహిళను ఇబ్బంది పెట్టిన సంగతి ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

చెన్నై లోని తిరువొత్తియూర్ లో( Thiruvotriyur ) ఓ ప్రాంతంలోని నాలుగు మార్గాల కూడలి వడ ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది.ఇక అదే సమయంలో అక్కడికి పరిగెడుతున్న గేదె ఓ మహిళను ఒక్కసారిగా కొమ్ముతో పట్టుకుని ఈడ్చుకెళ్లింది.దింతో ఆ మహిళను గేదె కొమ్ములతోనే రోడ్డుపై ఈదుచుకుంటూ చాలా దృరం తీసుకెళ్లింది.ఆ సమయంలో రోడ్డు పక్కన ఓ ఇంట్లో ఉన్న సీసీటీవీలో( CCTV ) దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనలో మహిళను రక్షించేందుకు పరిగెత్తిన మరో ఇద్దరు యువకులపై కూడా గేదె దాడి చేసింది.ప్రస్తుతం బాధితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగింది.

ఘటనలో గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చేరగా.అక్కడ ఆమెకు గాయపడిన ప్రాంతంలో ఏకంగా 25 కుట్లు పడ్డాయి.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.ఇంకెదుకు ఆల్సయం ఈ వైరల్ వీడియోను వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube