ఊహించని స్థాయిలో రెచ్చిపోయిన హనీరోజ్.. గ్లామర్ తో అభిమానులకు షాకిస్తోందిగా!

మలయాళ బ్యూటీ హనీ రోజ్( Honey Rose ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది.

 Honey Rose Rachel Movie Teaser Out Trending Now, Honey Rose, Veera Simha Reddy-TeluguStop.com

ఈ ఒక్క మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.మరీ ముఖ్యంగా ఈమె అందానికి యువత ఫిదా అయ్యారు.

కాగా ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా కూడా భారీగా అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు.

మరి ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమా( Veera Simha Reddy ) తర్వాత ఈమె ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్తూ సందడి చేస్తూ ఉంటుంది.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే హనీ రోజు తాజాగా నటించిన చిత్రం రేచెల్.తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా, సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు.

యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది.

వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్ హింట్ ఇస్తోంది.అలాగే ఈ సినిమాలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.కాగా ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube