మీ పిల్లలకి అలాంటి మాత్రలు వాడుతున్నారా.. జర జాగ్రత్త సుమీ..!

ప్రజలందరూ కరోనా వైరస్ వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వైరస్ నుండి ప్రజలు తమని తాము కాపాడుకోవాలంటే వ్యాధినిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

 Kids, Vitamin, Tablets, Be Care Full, Health Care, Health Tips, Health Benifits,-TeluguStop.com

వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ప్రతి ఒక్కరూ కూడా పోషక పదార్ధాలు నిండుగా ఉన్న ఆహారాన్ని తినాలి.ఈ క్రమంలో ప్రజలు వాళ్ళ ఆహారపు అలవాట్లతో పాటు విటమిన్ సప్లిమెంట్స్ మందులు కూడా వేసుకుంటున్నారు.

ప్రస్తుతం కరొనా వైరస్ కి వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ వాక్సిన్ కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఇంకా చిన్న పిల్లలకు వాక్సిన్ అందుబాటులోకి రాలేదు.ఈ క్రమంలో రాబోయే థర్డ్ వేవ్ కరోనా వైరస్ గురించి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.

ఈసారి థర్డ్ వేవ్ పిల్లల మీద బాగా ప్రభావం చూపుతుందని తల్లి తండ్రుల్లో భయాందోళనలు మొదలు అయ్యాయి.

ఈ క్రమంలో పిల్లలకు కూడా తల్లి తండ్రులు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను, విటమిన్ సిరప్ లను ఇస్తున్నారు.

నిజానికి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.ఇలా టాబ్లెట్స్ రూపంలో పిల్లలకు పోషకాలు అందించడం ఎంత వరకు సబబు మీరే ఒకసారి ఆలోచించండి.

చిన్న వయసు నుండే పిల్లలను మందులకు అలవాటు చేయడం మంచిది కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు.ఏదైనా గాని మనం పిల్లలకు పెట్టే ఆహారం ద్వారానే వాళ్ళకి పోషకాలు అనేవి అందుతాయి.

పిల్లలకు వేళకు తిండి తినిపిస్తూ, మంచి బలవర్ధమైన ఆహారం పెట్టడం వలన వాళ్ళు పుష్టిగా పెరుగుతారు.అలాగే వాళ్లలో ఇమ్మ్యూనిటీ పవర్ కూడా అధికం అవుతుంది.పిల్లలు వయస్సుకు తగ్గట్టు పిల్లలు పెరుగుతున్నారో లేదో అనే విషయాలను ఎప్పటికప్పుడు తల్లి తండ్రులు గమనించాలని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

Telugu Care Full, Benifits, Care, Tips, Tablets, Vitamin-Latest News - Telugu

మల్టీ విటమిన్లు కనుక చిన్న వయసులోనే పిల్లలకు ఇస్తే అవి విషంగా మారడానికి అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.కేవలం డాక్టర్ గారు సూచిస్తే మాత్రమే విటమిన్ సప్లిమెంట్లు పిల్లలకు ఇవ్వాలి.పిల్లలలో ఎదుగుదల లోపం ఉన్నాగాని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అలాంటి పిల్లలకు మాత్రమే మల్టీ విటమిన్లు, సిరప్ లను ఇవ్వాలని వైద్యులు అంటున్నారు.

పై విషయాలు దృష్టిలో పెట్టుకుని పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube