ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరగడంతో సోషల్ మీడియాను వినియోగించే వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది.అయితే సోషల్ మీడియా వల్ల కొన్ని లాభాలు ఉండటంతో పాటు నష్టాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి.
కొన్నిసార్లు సోషల్ మీడియా వల్ల అవాస్తవాలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నాయి.తాజాగా ప్రముఖ నటి షకీలా చనిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల గురించి స్పందిస్తూ షకీలా కీలక విషయాలను చెప్పుకొచ్చారు.ప్రస్తుతం కొన్ని టీవీ కార్యక్రమాలు చేస్తున్న షకీలా తన గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాల్లో, టీవీల్లో జరుగుతున్న ప్రచారం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని తన అభిమానులు కంగారు పడవద్దని ఆమె కోరారు.మిలా అనే బాలికను షకీలా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.మిలాతో కలిసి దిగిన ఫోటోలను సైతం షకీలా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం గమనార్హం.
తనకు తోడు ఎవరైనా ఉన్నారా అంటే మిలా మాత్రమే అని మిలా లేకపోతే తనకు లైఫ్ లేదని ఆమె అన్నారు.షకీలా గురించి తప్పుగా ప్రచారం చేసిన వాళ్లను శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
తాను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని సోషల్ మీడియాలో వదంతుల వల్ల తనకు పదుల సంఖ్యలో కాల్స్ వచ్చాయని తన క్షేమాన్ని కోరుకుని ఫోన్ చేసిన వాళ్లకు ధన్యవాదాలు అని షకీలా పేర్కొన్నారు.షకీలా తనపై వైరల్ అయిన వదంతులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.