శృంగారం అంటే కేవలం పిల్లలని కనే సాధనం కొందరికి.మరికొందరికి అది పడక సుఖం.
కాని జ్ఞావంతులకి శృంగారంలోని అంతర్లీన అర్థాలు, దాని గొప్పతనం అర్థమవుతాయి.ఇది కేవలం పిల్లలకి కనడానికి చేసే చర్య కాదు, అలాగని కేవలం పడక కోసం యాంత్రికంగా చేసేది కాదు, శృంగారం అంటే ఆరోగ్యం, శృంగారం అంటే ప్రేమ.
ఇటు శారీరకంగా, అటు మానసికంగా మనిషిని బలవంతుడిగా మార్చే గొప్ప కార్యం శృంగారం.ఈ మాట మన పూర్వికులు ఎప్పుడో చెప్పారు.
ఎన్నో గ్రంథాలు రాసి రతిలో మునగండి, ఎక్కువకాలం బ్రతకండి అంటూ సలహాలు ఇచ్చారు.అయినా, మనకు ఇప్పటి శాస్త్రవేత్తలు చెప్పిందే వేదం.
మన ఋషులు యుగాల క్రితం చెప్పిందే ఇప్పుడు వెస్ట్రన్ సైంటిస్టులు చెబుతున్నారు.శృంగారంలో ఎక్కువ పాల్గొంటే ఎక్కువ కాలం బ్రతుకుతారట.
ముఖ్యంగా రెగ్యులర్ శృంగారం మహిళల జీవితకాలాన్ని బాగా పొడిగిస్తుందట.సన్ మ్యాగజీన్ ఈ టాపిక్ మీద ఒక మెడికల్ రీసర్చి రిపోర్టుని ప్రచురించింది.
మన DNA ఎంతకాలం సురక్షితంగా ఉంటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతాం మనం.DNA మీదే ఉండే టెలిమోర్స్ మన DNA ని రక్షిస్తూ, మన జీవితకాలాన్ని ఓ ట్రాక్ లో ఉంచుతాయి.కాని వయసు పెరిగినాకొద్ది టెలిమోర్స్ తగ్గిపోతాయి.దాంతో మన DNA కి రక్షణ తగ్గుతుంది అలాగే మన ప్రాణాలకి గ్యారంటి తగ్గుతుంది.మరి ఈ టెలిమోర్స్ ఎక్కువకాలం పనిచేయాలంటే, మన DNA ఎక్కువకాలం సురక్షితంగా ఉండి, మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి ? చాలా సింపుల్ పని … శృంగారంలో పాల్గొనాలి.రెగ్యులర్ గా పాల్గొనాలి.
శరీరం శృంగారానికి బాగా సహకరించే ఆ 25-45 ఏళ్ల వయసుని బాగా ఉపయోగించుకోవాలి.ఆ వయసు దాటిన తరువాత కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వయసులో చెమట చిందించాలి.
రెగ్యులర్ శృంగారం పైన చెప్పినట్టుగా మనిషిని శారీరకంగా బలపరుస్తూనే, మానసికంగా బలపరిచి, హార్మోన్ బ్యాలెన్స్ తో తిరిగి శారీరక లాభాలనే అందిస్తుంది.ఇన్నిరోజులు శృంగారం వలన వచ్చే లాభాలు ఏమిటంటే హార్మోన్ బ్యాలెన్స్ అని, మంచి రక్తప్రసరణ అని, కొవ్వు తరుగుదల అని మనకు తెలిసిన లాభాలనే చెప్పుకున్నాం, కాని DNA కూడా లాభపడుతుందని తేల్చారు పరిశోధకులు.
మరి ఇకనైనా కష్టపడండి.