21 ఏళ్లుగా ఇండియాలో నివసిస్తున్న ఫ్రెంచ్ వ్యక్తి.. భారత్‌పై అతని అభిప్రాయం వింటే..

భారతదేశం సంస్కృతి( Indian culture ) విభిన్నతకు పెట్టింది పేరు.ఇక్కడ ఎన్నో రకాల భాషలు, సంప్రదాయాలు ఉంటాయి.

 A Frenchman Who Has Been Living In India For 21 Years Listen To His Opinion On-TeluguStop.com

అందుకే ఇండియాలో దొరికే అనుభవం ప్రపంచంలో మరెక్కడా దొరకదు.మన దేశంలోని రుచికరమైన వంటకాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, చూడదగ్గ టూరిస్ట్ స్పాట్స్ ఎంతో ఆకర్షిస్తాయి.

కొంతమంది భారతదేశాన్నే తమ స్థావర నివాసంగా కూడా ఎంచుకుంటారు.ఇలా ఇరవై సంవత్సరాలకు పైగా భారతదేశాన్నే తన స్వదేశంగా బతుకుతున్నాడో ఓ ఫ్రెంచ్ వ్యక్తి.ఆయన పేరు జీన్-బాప్టిస్టే.21 ఏళ్లుగా ఇండియాలో నివసిస్తున్న ఈ ఫ్రెంచ్ వ్యక్తి భారత్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.

Telugu French National, India, Jean Baptiste, Nri-Telugu NRI

జీన్-బాప్టిస్టే 2002లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ( JNU )లో చదువుకోవడానికి భారతదేశానికి వచ్చాడు.చదువు పూర్తి చేసిన తర్వాత, 21 సంవత్సరాలుగా ముంబైలో నివాసముంటున్నాడు.ఇటీవలే యూట్యూబ్ వీడియో ద్వారా భారతదేశం, ఇక్కడి ప్రజలపై తన అభిమానాన్ని పంచుకున్నాడు.

భారతదేశం, ఫ్రాన్స్ సంస్కృతుల మధ్య కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, కుటుంబ ప్రాముఖ్యత, స్నేహాలలో అనేక సిమిలారిటిస్ కూడా ఉన్నాయని అతను గుర్తించాడు.భారతదేశ సంప్రదాయాలకు జీన్-బాప్టిస్టే( Jean-Baptiste ) బాగా అలవాటు పడ్డాడు.

స్థానికులతో మెరుగ్గా మాట్లాడటానికి, తల ఊపు వంటి కొన్ని సాధారణ పదబంధాలను కూడా నేర్చుకున్నాడు.జెఎన్‌యులో జీన్-బాప్టిస్టే తన మొదటి స్నేహితులను సంపాదించుకున్నాడు, వారితో అనుబంధం ఏర్పడ్డాక భారతీయుల విలువలు అతనికి తెలిసాయి.

Telugu French National, India, Jean Baptiste, Nri-Telugu NRI

భారతదేశంలో మార్పుల వేగం నెమ్మదిగా ఉండటాన్ని జీన్-బాప్టిస్టే అభినందిస్తున్నాడు.ఇది ప్రజలు తమ తప్పుల నుంచి నేర్చుకోవడానికి, జాగ్రత్తగా ముందుకు సాగడానికి అనుమతిస్తుందని అతను నమ్ముతున్నాడు.భారతీయ ప్రజలలో శాంతిని కనుగొన్నాడు, పాశ్చాత్యులతో పోలిస్తే మన దేశస్థులకు పెద్దగా అహంకారాలు లేవని అతను అన్నాడు.మరింత నిజమైన అనుభవం కోసం విదేశీయులు భారతదేశంలోని తక్కువ తెలిసిన ప్రదేశాలను అన్వేషించాలని అతను సలహా ఇస్తున్నాడు.

ఏళ్లు గడుస్తున్న కొద్దీ, జీన్-బాప్టిస్టే జీవితంలో శాంతియుత విధానాన్ని అవలంబించడం ప్రారంభించాడు.సాధ్యమైనంతవరకు ఘర్షణలు, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.భారతదేశంలో తాను మనశ్శాంతిని కనుగొన్నానని అతను చెబుతున్నాడు.ఫ్రాన్స్‌లో ఇలాంటి మనశ్శాంతి దొరకలేదని అతని చెప్పాడు.

జీన్ ప్రయాణం భారతదేశంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా దీనిని తన స్వదేశంగా ఫీలవుతున్నాడు.ఈ లింక్ https://youtu.be/7GzlIsAWcD4?si=eK4C-Gr2EaSKB1phపై క్లిక్ చేసి అతడి వీడియోను చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube