ఆ కుటుంబంలో ముగ్గురూ ఐఏఎస్ లే.. అనూషా పిళ్లై సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ఒక కుటుంబంలో ఒక్కరు ఐఏఎస్( IAS ) సాధించడం ఎంతో కష్టమనే సంగతి తెలిసిందే.ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఐఏఎస్ సాధించడం సాధారణమైన విషయం కాదు.2023 సివిల్స్ విజేత అనూషా పిళ్లై( Anusha Pilly ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.అనూషా పిళ్లై తన సక్సెస్ గురించి మాట్లాడుతూ మా అమ్మ పేరు శ్రీమతి రేణు గోనెల పిళ్లై అని తెలిపారు.

 Ias Anusha Pillay Inspirational Success Story Details, Ias Anusha Pillay, Inspi-TeluguStop.com

అమ్మ 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అని అనూషా పిళ్లై పేర్కొన్నారు.

మా అన్నయ్య పేరు అక్షయ్ పిళ్లై ( Akshai Pillay ) అని ఈయన కూడా ఐఏఎస్ అని ఆమె తెలిపారు.

మా అన్నయ్య అక్షయ్ పిళ్లై 2021 సివిల్స్ టాపర్ గా నిలిచారని అనూషా పిళ్లై పేర్కొన్నారు.మా కుటుంబంలో ఏకంగా ముగ్గురు ఐఏఎస్ లు ఉండటం నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్.ఐ.టీ రాయ్ పూర్ నుంచి 2021 సంవత్సరంలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానని అనూషా పిళ్లై చెప్పుకొచ్చారు.

యూపీఎస్సీ సివిల్స్ లో( UPSC Civils ) జాతీయ స్థాయిలో 202 ర్యాంక్ సాధించానని రెండో ప్రయత్నంలోనే నేను నా లక్ష్యాన్ని సాధించడం జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ నాకు ఎంతో ప్లస్ అయిందని అనూషా పిళ్లై వెల్లడించారు.హై ఇన్ఫాక్ట్ రివిజన్ కోర్స్ ప్రిపరేషన్ సమయంలో ఎంతో ఉపయోగపడిందని ఆమె పేర్కొన్నారు.

ఆంత్రోపాలజీ సబ్జెక్ట్ ను ఆప్షనల్ గా ఎంచుకున్నానని అనూషా పిళ్లై తెలిపారు.

సివిల్స్ మెయిన్స్ నుంచి మంచి మార్కులు రావడంతో మంచి ర్యాంక్ వచ్చిందని అనూషా పిళ్లై పేర్కొన్నారు.మాక్ ఇంటర్వ్యూలు కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు.అనూషా పిళ్లై చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube