వయసు పైబడే కొద్ది ముఖంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.కండరాలు పటుత్వాన్ని కోల్పోయి ముడతలు, చారలు, చర్మ సాగడం వంటి ఏజింగ్ లక్షణాలు కనిపించడం సర్వసాధారణం.
కానీ ఇటీవల కాలంలో కొందరు 30 ఏళ్లకే ముసలి వారిలా కనిపిస్తున్నారు.అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, రసాయనాలతో నిండిన చర్మ ఉత్పత్తులను వాడడం తదితర కారణాలు వల్ల చిన్న వయసులోనే కొందరికి ముఖంలో వృద్ధాప్య లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి.వాటిని అద్దంలో చూసుకున్న ప్రతిసారి తీవ్ర అసహనానికి గురవుతుంటారు

కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ఫాలో అయితే యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అందుకోసం ముందుగా ఒక బంగాళదుంప తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సగానికి కట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ మరిగిన తర్వాత బంగాళాదుంప వేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపను తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.మిక్సీ జార్ లో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు మరియు అర కప్పు పచ్చి పాలు( Milk ) వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ప్యూరీలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా చేశారంటే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు, సన్నని గీతలు మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుతుంది.చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న తగ్గుముఖం పడతాయి.
కాబట్టి యంగ్ గా మరియు గ్లోయింగ్ గా మెరిసిపోవాలి అనుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.







