మీ జుట్టు డ్రై అయిపోయిందా? అయితే మీకోస‌మే ఈ హెయిర్ స్ప్రే!

డ్రై హెయిర్ లేదా పొడి జుట్టు.ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో వేధిస్తున్న సమస్య ఇది.

 Best And Natural Spray For Dry Hair! Natural Spray, Hair Spray, Latest News, Dry-TeluguStop.com

అందులోనూ ప్రస్తుత ఈ చలి కాలంలో డ్రై హెయిర్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడటం, తరచూ తల స్నానం చేయడం, పలు రకాల మందుల వాడకం, హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను యూస్ చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు పొడి బారి నిర్జీవంగా ఎండి పోయినట్లు అయిపోతుంది.

దాంతో ఈ సమస్యను నివారించుకునేందుకు తరచూ షాంపూలు మార్చడం, ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడడం చేస్తుంటారు.అలాగే ఏవేవో హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుంటే ఏం చేయాలో తోచక తీవ్రంగా సతమతమైపోతుంటారు అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ స్ప్రేను యూస్ చేస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా డ్రై హెయిర్ సమస్యను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ స్ప్రే ఏంటి.? దానిని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక క‌ప్పు కొబ్బ‌రి నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, రెండు స్పూన్లు అలోవేర ర‌సం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని నింపుకుని బాగా షేక్ చేసుకుంటే హెయిర్ స్ప్రే సిద్ధ‌మైన‌ట్టే.

Telugu Dry, Care, Care Tips, Spray, Latest, Natural Spray-Telugu Health - తె

దీనిని ఎలా వాడాలంటే.ముందుగా జుట్టుకు లైట్‌గా రెగ్యుల‌ర్ ఆయిల్‌ను అప్లై చేసుకోవాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న హెయిర్ స్ప్రేను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రే చేసుకోవాలి.

న‌ల‌బై నిమిషాల అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల స్నానం చేసేయాలి.నాలుగు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే పొడి జుట్టు నుంచి విముక్తి ల‌భిస్తుంది.మ‌రియు హెయిర్ స్మూత్‌గా, సిల్కీగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube