23 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 80 ఏళ్ల చైనీస్ వ్యక్తి.. ఎలాగంటే..??

చైనా( China )లో ఓ వింత ప్రేమ వివాహం జరిగింది.హెబీ ప్రావిన్స్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఈ అసాధారణ ప్రేమ కథ మొదలయ్యింది.

 An 80 Year Old Chinese Man Who Married A 23 Year Old Girl.. How Come, Hebei Pro-TeluguStop.com

ఇక్కడ 80 ఏళ్ల వృద్ధుడు లీ 23 ఏళ్ల యువ ఉద్యోగిని అయిన జియాఫాంగ్ తో ప్రేమలో పడ్డాడు.ఆమె కూడా అతడిని లవ్ చేసింది వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.

మొదట వారి మధ్య స్నేహం ఏర్పడింది.వారి స్నేహం ప్రేమగా మారి, పెళ్లి దాకా దారి తీసింది.

జియాఫాంగ్ లీ పరిణతి, జ్ఞానాన్ని ఇష్టపడితే, లీ ఆమె యవ్వనానికి, దయకు ఆకర్షితుడయ్యాడు.

జియాఫాంగ్( Xiaofang ) కుటుంబం ఈ వివాహానికి అంగీకరించకపోయినా, బంధువులతో సంబంధాలను తెంచుకుని లీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.ఒక చైనీస్ వార్తా సంస్థ ప్రకారం, కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాని చిన్న కార్యక్రమంలో వారి వివాహం జరిగింది.ఈ జంట ప్రేమను చాటే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ జంట కథ ఆన్‌లైన్‌లో చాలా చర్చకు దారితీసింది.కొందరు జియాఫాంగ్ డబ్బు కోసం పెళ్లి చేసుకుందని ఆరోపించగా, మరికొందరు ఆమె ధైర్యాన్ని, లీ పట్ల నిజమైన ప్రేమను ప్రశంసించారు.కుటుంబానికి ఆధారంగా ఉన్న జియాఫాంగ్, పెన్షన్‌పై ఆధారపడే లీని పెళ్లి చేసుకోవడం ద్వారా ప్రేమ ఏ అడ్డంకులనైనా అధిగమిస్తుందని నమ్మింది.ఈ కథ మధ్యప్రదేశ్‌( Madhya Pradesh )లోని మరొక వైరల్ కథను గుర్తుకు తెస్తుంది.

అక్కడ, 80 ఏళ్ల బాలరామ్ అనే వ్యక్తి మహారాష్ట్రకు చెందిన 34 ఏళ్ల షీలా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.బాలరామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఫన్నీ వీడియోలకు షీలా ముగ్ధురాలైంది ఆపై వారి పరిచయం పెళ్లి దాకా సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube