ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా క్రమరహిత నెలసరి… ఆడవారిలో చాలా మంది ఫేస్ చేసి సమస్యల్లో ఇది ఒకటి.మీ సాధారణ సైకిల్‌తో పోలిస్తే పీరియడ్స్ కొంచెం ముందుగా లేదా ఆలస్యంగా రావడాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు.
హార్మోన్ల ప్రభావం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల రుతు చక్రంలో మార్పులు చోటు చేసుకుంటాయి.దీని కారణంగా మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
అయితే అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు నెలసరి టైమ్ టు టైమ్ రావడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి.
అందులో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా కూడా ఒకటి.ఈ చిట్కాను పాటిస్తే క్రమరహిత నెలసరికి బై బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ( onion ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఉల్లి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి( Jaggery powder ) కలిపి తీసుకోవాలి.వారానికి ఒకసారి ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మీ నెలసరి టైమ్ టు టైమ్ రావడం స్టార్ట్ అవుతుంది.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య దూరం అవుతుంది.

అలాగే నెలసరి సమయంలో చాలా మంది కడుపు నొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగేయడం వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు.అయితే అలాంటి సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే నెలసరి నొప్పుల నుంచి సులభంగా ఉపశమనాన్ని పొందవచ్చు.