భూమిపై ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే అతనిలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే కళ్లు( Eyes ) లేకపోతే ఈ ప్రపంచం మొత్తం చీకటే.
చీకటిలో ఏమి చూడలేము.అలాగే ఏమీ చేయలేము.
అందుకే కళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది.అంతటి ప్రాధాన్యం ఉన్న కళ్ల ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉంటుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం.ఈ నేపథ్యంలో కళ్ల ను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కళ్లు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ ఏ( Vitamin A ) మాత్రమే సరిపోదని, కళ్లు హెల్తీగా ఉండడానికి మరికొన్ని విటమిన్లు కూడా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఆ విటమిన్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మొక్కల్లో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ ఏ గా మారుతుంది.రోజువారి తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ 750 మీల్లి గ్రాముల పరిమాణంలో ఉండాలి.

ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేప నూనె, పాలు, పసుపు, పచ్చని ఫలాలు, వెన్న టమాటాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా విటమిన్ బి12( Vitamin B12 ) లోపం వల్ల శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోయి రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.దీనివల్ల కళ్ల లో రక్తప్రసరణ కూడా దెబ్బతింటుంది.ఇలాంటి సమస్యలను నివారించడానికి విటమిన్ b12 ఎంతగానో ఉపయోగపడుతుంది.నియాసిన్, విటమిన్ b3 గ్లాకోమా వంటి కంటి సమస్యలను దూరం చేస్తాయి.కనులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
కాబట్టి కళ్ల ఆరోగ్యం కోసం ఆహారంలో విటమిన్ b1,b2,b3,b6 బి9, బి12లు ఉండే తృణధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, నట్స్ తీసుకోవాలి.







