వన్ ప్లస్ నోర్డ్ CE 4 స్మార్ట్ ఫోన్( OnePlus Nord CE 4 ) నేడే భారత మార్కెట్లో లాంచ్ కానుంది.ఈ ఫోన్ పెద్ద డిస్ ప్లే, కొత్త చిప్ సెట్, వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ తో భారీ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది.
ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అయ్యే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్ ప్లే ( AMOLED display )తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్, స్క్రీన్-టు-బాడీ రేషియో 93.4 శాతం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ ( Dragon 7 Gen 3 Chipset )ను కలిగి ఉంది.8GB LPDDR4x RAM ప్యాక్ తో వస్తోంది.వర్చువల్ RAM ద్వారా అదనంగా 8GB విస్తరించవచ్చు.5500mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, 100W సూపర్ ఊక్ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.29 నిమిషాల్లో 100శాతం ఫుల్ ఛార్జ్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే 50- మెగాపిక్సెల్ ( 50-megapixel )యొక్క రియల్ సెన్సార్, సోనీ LYT-600, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉంటుంది.8- మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా వైడ్ కెమెరా తో ఉంటుంది.సెల్ఫీల కోసం 16- మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది.అయితే ఈ ధరలపై స్పష్టమైన అధికారిక ధ్రువీకరణ లేదు.
ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు లాంచింగ్ సమయంలో వెలువడనున్నాయి.