Ariyana Glory: క్రూయిజ్ పార్టీలో అరియనా…పింక్ డ్రెస్ లో రచ్చ చేసిన బ్యూటీ?

అరియనా గ్లోరీ( Ariyana Glory ) పరిచయం అవసరం లేని పేరు యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ గా మారిపోయారు.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు.

 Ariyana Glory Mesmerizing With Her Dance In Cruise Party-TeluguStop.com

అయితే రామ్ గోపాల్ వర్మతో ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశారో ఆ క్షణమే ఈమె సెన్సేషనల్ గా మారిపోయారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి అరియనా బిగ్ బాస్ కార్యక్రమంలో ఏకంగా రెండుసార్లు పాల్గొని సందడి చేశారు.

Telugu Ariyana Glory, Cruise, Dance, Dubai, Tollywood-Movie

ఇలా బిగ్ బాస్( Dubai ) కార్యక్రమం ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఏదైనా పండుగలు లేదా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే ఆ కార్యక్రమాలలో అరీయానా తప్పనిసరిగా సందడి చేస్తూ కనిపిస్తున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో కాస్త శరీర బరువు పెరిగి బొద్దుగా మారినటువంటి ఈమె భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.అంతేకాకుండా తరచూ వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా అరియనా తన వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.</br

Telugu Ariyana Glory, Cruise, Dance, Dubai, Tollywood-Movie

ఇకపోతే ఇటీవల ఈమె దుబాయ్ వెళ్లారని తెలుస్తుంది.దుబాయిలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ స్నేహితులతో కలిసి డాన్సులు చేస్తూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు అయితే దుబాయ్ వెళ్లినటువంటి ఈమె అక్కడ క్రూయిజ్ షిప్ పార్టీలో సందడి చేస్తూ కనిపించింది.ఆ వీడియో, ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

పార్టీలో ట్రెండీ వేర్ లో అరియానా అందరి దృష్టిని ఆకర్షించింది.</br

Telugu Ariyana Glory, Cruise, Dance, Dubai, Tollywood-Movie

ఇలా గులాబీ రంగు డ్రెస్ ధరించి అందాలన్నింటిని ఆరబోస్తూ సందడి చేయడమే కాకుండా ఊ అంటవా మావ, రారా రక్కమ్మ వంటి సాంగ్స్ కు డాన్స్ చేసి మడతెట్టేసింది.అరియానా స్టెప్పులకు అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈమె క్రూయిజ్ షిప్ పార్టీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇటీవల కాలంలో బిగ్ బాస్ అమర్ ను సపోర్ట్ చేస్తూ ఈమె పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులను చేస్తూ కూడా వార్తలలో నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube