టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ తమన్ ఒకరు.ఈయన మొదట్లో ఎన్ని విమర్శలు ఎదుర్కున్న దృడంగా నిలబడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఈయన ప్రెసెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.తమన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ హిట్ అవడమే కాకుండా అభిమానుల గుండెల్లో నిలిచి పోతున్నాయి.
ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమా అయినా కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే వినిపించే పేరు థమన్.
ఈయన అంతలా అభిమానులకు దగ్గర అవుతున్నాడు.
ఈయన అల వైకుంఠపురములో సినిమా దగ్గర నుండి వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నాడు.ఈయన సినిమాలకు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియెన్స్ మదిని గెలుచుకుంటున్నారు.
థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
గత ఏడాది క్రాక్, అఖండ వంటి సినిమాల విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు థమన్.
ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో మరో సాలిడ్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు థమన్.ఈయన అందించే సంగీతం సినిమాను హై లెవల్ లో ప్రెసెంట్ అయ్యేలా చేస్తుంది.
దీంతో సక్సెస్ లో ఈయన పాత్ర కీలకం అయ్యింది.ప్రెసెంట్ ఈయన సర్కారు వారి పాట సినిమా కు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుండి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.తాజాగా ఒక నెటిజెన్ కళావతి సాంగ్ మ్యానియా అంటూ ఒక వీడియోను షేర్ చేస్తూ థమన్ ను ట్యాగ్ చేసాడు.ఈ వీడియో చూసిన థమన్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.2012లో సారొస్తారా సాంగ్.2022లో కళావతి సెన్సేషనల్” అంటూ ట్వీట్ చేశారు.2012లో మహేష్ బాబు, కాజల్ చేసిన బిజినెస్ మాన్ సినిమాలో సారొస్తారా సాంగ్ అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది.ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కళావతి సాంగ్ సినేషనల్ కావడంతో థమన్ సంతోషం వ్యక్తం చేస్తూ అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నాడు.







