టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఎన్టీఆర్ ఒక నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
అయితే ఎన్టీఆర్ నయనతార గురించి ఒక విషయం ముందే చెప్పాడట.తను కవల పిల్లలకు తల్లి అవుతుందని ఎన్టీఆర్ గతంలోనే చెప్పాడట.
అదేంటి ఎన్టీఆర్ చెప్పడం ఏంటి అని అనుకుంటున్నారా.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటి నయనతార.ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.తను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది నయన.తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హోదా లో నిలిచింది.ఎన్నో సినిమాలలో లేడి ఓరియెంటెడ్ పాత్రలలో నటించి గొప్ప టైటిల్ ను సొంతం చేసుకుంది.
ఇక 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.
ఇక ఈమె హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయం లో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఇక ఇప్పుడు తను తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది.
కానీ విగ్నేష్ శివన్ కు ముందు తను మరో హీరో ప్రభుదేవాతో విడాకులు తీసుకుంది.తర్వాత మరో డైరెక్టర్ శింబూతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
కాగా కొన్ని రోజుల తర్వాత తాను నటించిన ఓ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి ఆ తర్వాత అందరి సమక్షంలో వివాహం చేసుకుంది.
అంతేకాకుండా సినిమా షూటింగ్ లో వారిద్దరు కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో బాగా షేర్ చేసుకునేవాళ్లు.గతంలో వీరి పెళ్లి ఎన్నో సార్లు వాయిదా పడింది.చివరికి ఆ మధ్యనే అందరి సమక్షంలో ఒకటయ్యారు.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట రెండుసార్లు హనీమూన్ ట్రిప్స్ వేసి అందరికంటే భిన్నంగా కనిపించారు.పైగా అక్కడికి పెళ్లి బాగా ఎంజాయ్ చేసిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉండేవారు.
ఇక ఇదంతా పక్కన పెడితే.ఇప్పటివరకు నయనతార ప్రెగ్నెంట్ అన్న వార్త కూడా రాలేదు.కానీ తాజాగా నయనతార దంపతులు ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.ఇప్పటికే ఈ వార్త అంతట వైరల్ అయింది.అసలు ఇది ఎలా సాధ్యం అంటూ అందరూ నాన్న రకాల ప్రశ్నలు వేస్తున్నారు.అయితే కొందరు ఇది సరోగసి ద్వారా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది అని అనగా.
మరికొందరు వారు పిల్లల్ని దత్తత తీసుకున్నారు ఏమో అని అంటున్నారు.
ఇక ఈ వార్త ఇలా సాగితే.నయనతార కు ఇద్దరు కవల పిల్లలు పుడతారు అని ఎన్టీఆర్ ముందే చెప్పాడట.అదేంటి ఎన్టీఆర్ చెప్పడం ఏంటి అని అనుకుంటున్నారా.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.నయనతార గతంలో ఎన్టీఆర్ సరసన అదుర్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక అందులో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో నయనతారతో.మీకు కవలలు పుడతారండి.
మచ్చ శాస్త్రం చెబుతుంది అని ఒక డైలాగ్ కొడతాడు.దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.
అంటే ఎన్టీఆర్ అప్పుడే చెప్పాడు అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.