గురువారం సాయిబాబాను ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ దూరం..?

గురువారం రోజు బాబాను పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు.గురువారం రోజున సాయిబాబాను నిష్కళంకమైన భక్తితో పూజించి ఉపవాసం ఉన్నవారి కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం.

 If You Worship Sai Baba Like This On Thursday, All Your Troubles Will Go Away..-TeluguStop.com

సాయిబాబా( Sai Baba ) మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు.

అయితే ఈ వ్రత నియమాలను పాటించడం తప్పనిసరి.

Telugu Devotional, Harati, Panchamrutham, Sai Baba, Thursday, Yellow-Latest News

గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు, ఆచారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం ఉపవాసం ఉండడం మంచిది.ఉపవాసం రోజు ప్రశాంతంగా ఉండండి.

ఎవరి గురించి చెడుగా భావించకూడదు.ఇంకా చెప్పాలంటే మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు.

సాయిబాబా పూజ ఉపవాసం ఉన్నప్పుడు నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలని నియమం లేదు.మీరు ఒక సమయంలో పండు లేదా ఒక భోజనం తినడం ద్వారా ఈ ఉపవాసాన్ని పాటించవచ్చు.

Telugu Devotional, Harati, Panchamrutham, Sai Baba, Thursday, Yellow-Latest News

బాబాకు సమర్పించే ప్రసాదాన్ని పంచిపెట్టి తీసుకోవాలి.పూజకు దూపం, దీపం, సాయిబాబా విగ్రహం, చందనం, పసుపు, పువ్వులు, నెయ్యి దీపం, పసుపు వస్త్రం, పంచామృతం, ప్రసాదం, పండ్లు మొదలైనవి అవసరం.హారతి ( Harati )ఇవ్వడం అసలు మర్చిపోకూడదు.గురువారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయాలి.అప్పుడు శుభ్రమైన దుస్తులను ధరించాలి.ఆ తర్వాత బాబా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయడం మంచిది.

దీని తర్వాత సాయిబాబాను ఆరాధిస్తూ ఉపవాసం పాటించాలి.పూజ ప్రారంభించే పనులు సాయిబాబా విగ్రహం కింద శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచండి.

అలాగే సాయి చాలీసా( Sai Baba Chalisa ) చదవడం కూడా ఎంతో మంచిది.సాయి బాబా పూజ ముగింపులో బాబాకు హారతి ఇవ్వడం మర్చిపోకూడదు.

అందరికీ ప్రసాదం పంచాలి.పదిమందికి వీలైనంతలో దానం చేయాలి.

అప్పుడు బాబా అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube