హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఇప్పటికే హైదరాబాద్ లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది.
ఈ క్రమంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు.మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్లన్నీ నీట మునగడంతో చెరువులను తలపిస్తున్నాయి.భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.







