తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) అయితే ఈయన ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా లో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దాంతో పాటుగా రానాతో లీడర్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయం మీద ఇప్పటినుంచే కసరతులు చేసినట్టు తెలుస్తుంది.
అయితే తను కుబేర సినిమా( Kubera ) షూటింగ్ లో పాల్గొంటున్నప్పటికీ ఈ సినిమా మీద కూడా తను భారీ ప్లానింగ్ ని వేసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే కుబేర సినిమా షూటింగ్ అయిపోయేలోపు లీడర్ 2( Leader 2 ) సినిమా మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం తో అటు ఆ సినిమా చేస్తూనే సైమల్ టెన్నిస్ గా ఇటు ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని దించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కీయారా అద్వానీ( Kiara Advani ) ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రతిది చాలా రిచ్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే కియారా అద్వాని గురించి చూసుకుంటే తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో నటించింది.అలాగే రామ్ చరణ్ హీరో గా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ కి ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఇక ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.మరి ఇలాంటి క్రమంలో కీయారా అద్వాని రానాతో సినిమా నటిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
.