ఇక్కడ యూట్యూబ్( Youtube ) వాడని జనాలు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.స్మార్ట్ ఫోన్ ( Smart phone )వున్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూడాల్సిందే.
అంతలా యూట్యూబ్ ప్రజాదరణ పొందింది.ఎంతలా అంతే ప్రపంచ వ్యాప్తంగా దీనికి యూజర్లు వున్నారు.
దీనిని ఎక్కువమంది వాడడానికి గల ఇంకో కారణం ఏమంటే, ఇక్కడ వీడియోలను ఫ్రీగా చూడొచ్చు.దానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.
అయితే మీకు ఓ చేదు వార్త.యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ ను అడ్డుకోవడానికి యాడ్ బ్లాకర్స్ ను ఉపయోగించే వారి కోసమే ఈ బ్యాడ్ న్యూస్.

ఇపుడు ఆయా యాడ్స్ ను బ్లాక్ చెయ్యకుండా నిరోధించేందుకు యూట్యూబ్ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది.ఈ ఫీచర్ కనుక వచ్చినట్లయితే యూట్యూబ్ లో యాడ్స్ ను స్కిప్ లేదా అడ్డుకునే వీలుండదు.అంటే, యూట్యూబ్ వీడియోలో వచ్చే యాడ్స్ ను ఇకనుండి పూర్తిగా చూడవలసి ఉంటుంది.అవును, యూట్యూబ్ లో మీరు కంటెంట్ పైన వచ్చే యాడ్స్ ద్వారా మాత్రమే ఆ వీడియో క్రియేటర్లు ఆదాయాన్ని పొందుతారు.
ఇక యూజర్లు వీడియోల పైన వచ్చే యాడ్స్ ని కనుక చూడకపోతే వారికి ఎటువంటి ఆదాయం ఉండదు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే, ఎటువంటి యాడ్స్( Ads ) లేకుండా యూట్యూబ్ వీడియోలను చూసే అవకాశం కూడా వుంది.అయితే దీనికోసం మీరు యూట్యూబ్ ప్రీమియం( YouTube Premium ) సబ్ స్క్రిప్షన్ ని తీసుకోవలసి ఉంటుంది.
వాస్తవానికి, గత సంవత్సరం పడిపోయిన రెవిన్యూ ఈ సంవత్సరం మొదటి క్వార్ట్రర్ లో కూడా మరింత దిగజారిన కారణంగా, యూట్యూబ్ ఈ గ్యాప్ ని ఫిక్స్ చేసి కంటెంట్ క్రియేటర్స్ ని ప్రోత్సహించే పనిలో పడింది.ఇక ఈ కొత్త పరిణామం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.







