పెళ్లిళ్ల సీజన్ వచ్చింది తులం బంగారం తూచేనా ? 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తనదైన శైలిలో ఆ పార్టీ పైన ప్రభుత్వం పైన వ్యంగంగా విమర్శలు చేస్తూ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ , ఆయన పాలనలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు.

 Ktr Coments On Cm Revanth Reddyts About Mahalakshmi Scheme , Politics, Tg Gov-TeluguStop.com

తాజాగా మరోసారి కాంగ్రెస్  ప్రభుత్వం పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ).ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు పై తనదైన శైలిలో కేటీఆర్ సెటైర్లు వేశారు.లక్షల లగ్గాలు జరిగే మ్యారేజ్ సీజన్ మళ్ళీ వచ్చిందని,  ఈసారి కూడా తులం బంగారం తూచ్ తూచేనా అని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.  శుభ ముహూర్తాలతో పెళ్లి సందడి మొదలైందని,  మరి మీ కళ్యాణమస్తు కానుక హామీ అమలకు ముహూర్తం దొరకట్లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.10 గ్రాముల పసిడి ఆశ జూపి ఆడపిల్ల ఓట్లు వేయించుకున్నావని,  ఆడిన మాట తప్పి పచ్చని పందిళ్ళ సాక్షిగా వచ్చి దగా చేస్తున్నావని కేటీఆర్ మండిపడ్డారు.

Telugu Aicc, Ktr Tweet, Pcc, Tg-Politics

 కనకపు సింహాసమున కూర్చున్నాక కనకం హామీని మర్చిపోయావా ? లంక బిందెలు దొరకలేదన్న నైరాస్యంతో నవ వధువులకు ఇవ్వాల్సిన  పుత్తడిని ఎగ్గొట్టడం భావ్యమా అని కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు.పేదింటి పెండ్లి కూతుళ్లకు టన్నుల కొద్ది గోల్డ్ బాకీ పడ్డావని,  ఒలంపిక్స్ లో మోసాల పోటీ పెడితే నీకు గోల్డ్ మెడల్ గ్యారెంటీ అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు.

Telugu Aicc, Ktr Tweet, Pcc, Tg-Politics

గట్టి మేళాలు మోగుతున్నాయి , వట్టి మాటలు ఇంకెన్నాళ్లు గోల్డ్ షాపుల్లో స్టాక్ లేదా బంగారం గనల్లో తవ్వకాలు ఆగిపోయాయా అని వ్యంగంగా ప్రశ్నించారు.వాగ్దానం చేసి వంచించడం మంచిది కాదని ఆడబిడ్డలు బాధపడితే అరిష్టమని ఈ సీజన్ లోనైనా తులం బంగారం పథకాన్ని ప్రారంభించండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శలు చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube