తెలుగు ప్రేక్షకులకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Rythu Bidda Pallavi Prashanth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రైతుబిడ్డ అనే ట్యాగుతో బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.
బిగ్‌బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇవ్వకముందు సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు పల్లవి ప్రశాంత్.ఇక బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు.
ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు.బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు.
ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్‌బాస్ విన్నర్ గా( Bigg Boss Winner ) స్టార్‌గా ఎదిగాడు.అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.తాజాగా స్టార్ మా అవార్డ్స్ వేడుకలో మెరిశాడు.దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తన తన ట్విటర్లో పోస్ట్ చేసింది.స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో( Star Maa Parivaar Awards ) పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది.
మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప( Pushpa ) స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు.
ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది.అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా వరకు నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చేసరికి యాటిట్యూడ్ పెరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరు పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.