ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్: రాజ్ తరుణ్ మొత్తానికి కొట్టేలా ఉన్నాడే!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.ఇటీవల మనోడు చేస్తున్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తుండటంతో, ప్రతిసారి కొత్త సినిమాతో హిట్ కొట్టాలని చూస్తూ వస్తున్నాడు.

 Raj Tarun Orey Bujjiga Trailer Impressive-TeluguStop.com

కాగా రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా, ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ కాలేదు.ఇక వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించగా, కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

కాగా ఈ సినిమాను ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఒరేయ్ బుజ్జిగా సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ సినిమా ట్రైలర్ ఫుల్టూ ఎంటర్‌టైనర్‌గా తీర్చి దిద్దడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

ఈ ట్రైలర్‌లో రాజ్ తరుణ్, అమృత నాయర్, హెబ్బా పటేల్‌ల మధ్య సాగే మనస్పర్ధల కారణంగా వారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారు అనేది సినిమా కథగా మనకు చూపించనున్నారు.ఇక హెబ్బా పటేల్, రాజ్ తరుణ్‌ల కాంబోలో వచ్చిన సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా అదిరిపోయే హిట్ అందుకుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కొండా విజ‌య్‌కుమార్ తెరకెక్కించి ఒరేయ్ బుజ్జిగా చిత్రంతో రాజ్ తరుణ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఇక ప్రేక్షకుల్లో ట్రైలర్‌తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా హిట్ కావడం హీరోతో పాటు హీరోయిన్లకు కూడా కీలకంగా మారింది.మరి ఈ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube