తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్య,బీజేపీ పనేనా!

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు అయితే ముగిసాయి కానీ హింసా ఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.గత ఎన్నికల సమయం నుంచి పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ నేతల మధ్య పెద్ద వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

 Trunamul Congress Tmc Leader Sofiul Hasan Shot Dead Pachim Bengal Politics-TeluguStop.com

ఈ క్రమంలో అక్కడ ఎన్నికల సమయంలో అల్లర్లు చోటుచేసుకోవడం ఇరు పార్టీలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.అయితే మాపై మీరు దాడి చేశారంటే,మీరంటూ ఇరు పార్టీలు ఒకరిపై నొకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు.

అయితే ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నేత సోఫీయుల్ హాసన్ దారుణ హత్యకు గురయ్యారు.హమైపూర్ గ్రామ పెద్ద అయిన ఆయన హరిహర్ పరకు కారులో వెళుతుండగా ముర్షిదాబాద్ వద్ద ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆయనను దారుణంగా కాల్చి చంపారు.

అయితే అసలు ఎవరు ఈ దారుణానికి ఒడిగట్టారు అన్న విషయాలను పక్కనపెడితే తృణమూల్ నేతలు మాత్రం ఇది బీజేపీ పనే అంటూ ఆరోపిస్తుంది.

-Telugu Political News

గత కొద్దీ రోజులుగా తృణమూల్ కార్యకర్తలపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి.మొన్నటికి మొన్న హుగ్లీ జిల్లా లో ఒక నేతను హత్యచేసి రైల్వే ట్రాక్ పై పడేసిన సంగతి తెలిసిందే.అలానే ముర్షిదాబాద్ లోనే పార్టీ కార్యకర్తల ఇళ్ల పై బాంబు దాడి చోటుచేసుకోవడం తో ముగ్గురు ఆ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇలా వరుస దాడులతో తృణమూల్ నేతలు ప్రాణాలు కోల్పోతుండడం తో ఇది బీజేపీ కుట్రే నని తృణమూల్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube