ప్రేమలో పడిన బిగ్ బాస్ బ్యూటీ దివి.. నీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నానంటూ పోస్ట్!

తన చూపు అందాలతో కట్టిపడేసిన పొడుగు కాళ్ళ సుందరి దివి అంటే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది ఈ బ్యూటీ.

 Bigg Boss Beauty Divi Who Fell In Love I Am Waiting Here For You Post, Bigg Boss-TeluguStop.com

ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ తర్వాత వెండితెరపై అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన ఆటపాటలతో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.తన అందంతో అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.

ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.అంతే కాకుండా తాను నటించిన క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోవడం లేదు.ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.

ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోకపోవటంతో తన ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం వారికి చాలా టచ్ లో ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.ఇక దానికి ఒక కొటేషన్ కూడా పంచుకుంది.

నిజానికి దివి చాలావరకు లవ్ కు సంబంధించిన కొటేషన్స్ బాగా పంచుకుంటుంది.దీంతో ఆమె లవ్ లో పడిందని చాలామంది అనుకుంటున్నారు.

కానీ ఆ విషయం మాత్రం ఇప్పటికే క్లారిటీగా లేదు.

తాజాగా తను ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉండగా దానికి సంబంధించిన ఒక వీడియో పంపిస్తూ.

నీ ధ్యాసలతో ఈ సాంట్ ఏంజెలో బ్రిడ్జ్ పైన నిన్ను చేరుకునే రోజు కోసం ఎదురు చూస్తున్న అని ఒక కొటేషన్ పెట్టడంతో.కచ్చితంగా ఈమె ప్రేమలో పడింది అని అంటున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం ఆ కొటేషన్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube