1.ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణ వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.
2.గాంధీభవన్ లో పాసుల వివాదం
రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర సందర్భంగా జరిగే సభకు హాజరయ్యేందుకు గాంధీభవన్ లో పాసులు జారీ చేస్తున్నారు.మహిళా కాంగ్రెస్ విభాగానికి పాసులు సక్రమంగా పంపిణీ జరగడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
3.తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది.టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఉన్న బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యత్వానికి అంతకుముందే రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
4.ఉస్మానియా యూనివర్సిటీ లో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఓయు వైస్ ఛాన్స్ లర్ ప్రభుత్వానికి దూతగా వ్యవహరిస్తున్నాడని ఐ ఏ ఎస్ ఎస్ ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
5.యాదాద్రి పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
నిన్న కురిసిన వర్షానికి యాదగిరి గుట్ట వద్ద రోడ్డు కొట్టుకుపోవడం పై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.హైదరాబాదులో పడినట్లు వర్షం పడితే యాదగిరిగుట్ట గుడి కూడా కూలిపోయేది అని వ్యాఖ్యానించారు.
6.షర్మిల కామెంట్స్
టిఆర్ఎస్ ప్రభుత్వానికి పేదవాడు అంటే గౌరవం లేదని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
7.కవితకు అరవింద్ సవాల్
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది.కవితకు దమ్ముంటే మళ్ళీ తన పై పోటీ చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ సవాల్ విసిరారు.
8.రాహుల్ రేవంత్ ఇద్దరు ఐరన్ లెగ్ లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఐరన్ లెగ్ లు అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు.
9.హైదరాబాద్ లో ఫ్లెక్సీ ల వివాదం
రాహుల్ గాంధీ వైట్లెం ఛజ్ కు సిద్ధమా అంటూ హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వెలువడిన.ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి.
10.76 వ రోజుకు షర్మిల పాదయాత్ర
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 76 వ చేరుకుంది.
11.బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలోనే బిజెపిలో చేరబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
12.శ్రీవారి మెట్టు నడక దారి పున ప్రారంభం
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునః ప్రారంభించారు.
13.హెచ్ యు ఆర్ ఎల్ లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
ఐఓ సీఎల్ , ఎన్.టీ.పీసీ, కోల్ ఇండియా, ఎఫ్ సీ ఐ ఎల్ , హెచ్ ఎఫ్ సీ ఎల్ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్ వర్క్ అండ్ రసాయన లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
14.ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పట్లో పార్టీ పెట్టేది లేదని ప్రకటించారు అయితే బీహార్లో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపడతానని ఆయన ప్రకటించారు.
15.తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు విచ్చేశారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సండే చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
16.తిరుపతిలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు.
17. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు తాళ్లవలస గ్రామంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
18.కెసిఆర్ హరీష్ పై రేవంత్ కామెంట్స్
నువ్వు నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది హరీష్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
19.మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
రానున్న రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
20.నేడు రాష్ట్రవ్యాప్తంగా బిజేపి నిరసనలు
ఏపీలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఉదంతాలను నిరసిస్తూ నేడు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
.