చంద్రబాబు దత్త పుత్రుడు అంటూ చాలా కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసిపి నాయకులు ఘాటు గా విమర్శిస్తునే వస్తున్నారు.స్వయంగా ఏపీ సీఎం జగన్ సైతం పవన్ ను సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే పేరుతో పిలుస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని మొదట్లో పవన్ తో పాటు , ఆ పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకోలేదు.కానీ ఈ వ్యాఖ్యలు ద్వారా జనాల్లో చులకన అవుతుండడం, అదే పేరుతో పిలవడం వైసీపీ నాయకులకు అలవాటు గా మారడం తో నేరుగా ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు.
ఇకపై దత్తపుత్రుడు అని తనను ఎవరైనా పిలిస్తే , జగన్ ను సిబిఐ దత్తపుత్రుడు వెళ్ళవలసి ఉంటుంది అంటూ హెచ్చరికలు చేశారు. అయినా పదేపదే వైసిపి నాయకులు దత్తపుత్రుడు అంటూ పవన్ ను చేస్తుండడం వైసిపి సోషల్ మీడియాలో ఈ విషయంపై రాద్ధాంతం చేస్తుండడం వంటి వాటిని పవన్ సీరియస్ గా తీసుకున్నారు.
ఇకపై వైసిపి విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోను తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్న పవన్ ఇక నుంచి జగన్ను సిబిఐ దత్తపుత్రుడు గానే పిలవాలని డిసైడ్ అయ్యారట.అలాగే వైసీపీ ని చంచల్ గూడా షటిల్ టీం గా పిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
జనసేన ను తనను మానసికంగా వైసిపి నాయకులు ఎలా వేధిస్తున్నారో అదేవిధంగా వైసీపీని వేధించాలని నిర్ణయించుకోవడంతో , ఇక ఈ అంశంపై జనసేన దృష్టి పెట్టింది.

ఇక నుంచి వైసీపీ నాయకులు సోషల్ మీడియా, మీడియా లో చేసే విమర్శలకు అంతే స్థాయిలో ఘాటుగా విమర్శలు చేయాలని పార్టీ నాయకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారట.అలాగే ఏపీలో నెలకొన్న ప్రజా సమస్యలను మరింత హైలైట్ చేసి ఎన్నికల వరకు వైసీపీ ని టార్గెట్ చేసుకోవాలని జనసేన డిసైడ్ అవ్వడం తో ఇక ఏపీలో దత్తపుత్రుడు.సీబీఐ దత్తపుత్రుడు పేర్లు మారుమోగే అవకాశం కనిపిస్తోంది.








